‘ఎఫ్2’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి…


'ఎఫ్2' రీమేక్‌తో బాలీవుడ్‌లోకి...

‘ఎఫ్2’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి…

తెలుగు చిత్రసీమలో కొన్నేళ్లుగా టాప్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమా ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ బ్లాక్‌బస్టర్ హిట్టయి, ఇప్పటికీ 2019 సినిమాల్లో నంబర్‌వన్ గ్రాసర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాని హిందీలో పునర్నిర్మించేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనతో బోనీ కపూర్ కలిశారు. ఆ ఇద్దరూ సంయుక్తంగా నిర్మించే రీమేక్‌కు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించనున్నారు. ‘ప్యార్ తో హో నా హి థా’, ‘దీవాంగీ’, ‘నో ఎంట్రీ’, ‘వెల్‌కం’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘రెడీ’, ‘వెల్‌కం బ్యాక్’, ‘ముబారకన్’ వంటి సినిమాల్ని అనీస్ రూపొందించారు.

తెలుగులో వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ పోషించిన పాత్రల్ని హిందీలో ఎవరు చేస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. త్వరలోనే ఆ వివరాల్ని తెలియజేస్తామని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తన ట్విట్టర్ పేజీలో తెలిపింది.

‘ఎఫ్2’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి…| actioncutok.com

You may also like: