‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి…’ అంటోన్న సిద్ధార్థ్!


'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి...' అంటోన్న సిద్ధార్థ్!

‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి…’ అంటోన్న సిద్ధార్థ్!

“నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం’’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు హీరో సిద్ధార్థ్. నటుడిగా మాత్రమే కాదు గాయకుడి గానూ ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు.

‘బొమ్మరిల్లు’లో ‘‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో…’’, ‘ఓయ్’ సినిమాలో ‘‘176 బీచ్ హౌస్ లో ప్రేమదేవత’’, ‘ఆట’ సినిమాలో ‘‘నిన్ను చూస్తుంటే’’ పాటలను పాడింది సిద్ధార్థే. అయితే చాలా రోజుల తర్వాత ఈ హీరో మరో తెలుగు పాట పాడారు. కాకపోతే ఇది ఆయన సినిమా కోసం కాదు. సందీప్ కిషన్ సినిమా కోసం!

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఈ చిత్రంలో అన్యాసింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తీక్ రాజు దర్శకుడు.

ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ ‘‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి’’ని సిద్ధార్థ్ పాడారు. ఇటీవలే ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘‘తెలుగులో పాట పాడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలోని మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంలో తెలుగు భాష మరింత తీయగా ఉంటుంది.

న‌టుడిగా నాకు గుర్తింపు, గౌర‌వం, స్టార్‌డమ్‌నీ ఇచ్చింది తెలుగు సినిమానే. తెలుగు ప‌రిశ్ర‌మ‌ అంటే నాకు ప్ర‌త్యేక అభిమానం ఉంది. తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగును నేనెప్పుడూ మరచిపోను.

నేను ఈ పాట పాడటానికి ఒక్కటే కారణం. నాకు సందీప్ కిషన్ అంటే చాలా ఇష్టం. వ్యక్తిగా, నటుడిగా తను నాకు తమ్ముడి లాంటి వాడు. తను ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేస్తున్నాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో నన్ను పాడమని అడిగాడు. తన కోసమే నేను ఈ పాట పాడాను’’ అన్నారు.

'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి...' అంటోన్న సిద్ధార్థ్!

Related articles: