అల్లు అరవింద్‌కూ బన్నీకీ మధ్య తీవ్ర కలహాలా?

అల్లు అరవింద్‌కూ బన్నీకీ మధ్య తీవ్ర కలహాలా?
ఉన్నవి లేనట్టూ, లేనివి ఉన్నట్టూ సృష్టించడం ఈ మధ్య సోషల్ మీడియాలో సర్వ సాధారణమైపోయింది. వాటిని సీరియస్‌గా తీసుకొని మీడియా కూడా ఒక్కోసారి తప్పుటడుగులు వేస్తోంది. తాజాగా ఒక హాస్యాస్పదమైన విషయాన్ని ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక దక్కన్ క్రానికల్ ప్రచురించింది.
దాన్ని రిపోర్ట్ చేసింది సీనియర్ మోస్ట్ జర్నలిస్టుగా పేరుపొందిన సుభాష్ కె. ఝా. ఆయన రాసిన వార్త సారాంశం తండ్రీ కొడుకులైన అల్లు అరవింద్, అర్జున్ మధ్య కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయంట. అరవింద్ తన కొడుకుతో కాకుండా వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తుంటే, బన్నీ తండ్రి జోక్యం లేకుండా సొంతంగా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడంట.
ఇది చదివిన సినీ వర్గాలు ఒకటే నవ్వుకుంటున్నాయి. అల్లు అరవింద్ గురించి తెలిసిన వాళ్లకెవరికైనా ఆ వార్త ఎంత హాస్యాస్పదమో అర్థమైపోతుంది. బన్నీతో కలహాల కారణంగానే మహేశ్, రాంచరణ్‌లతో సినిమాలు నిర్మించడానికి అల్లు అరవింద్ వాళ్లను కలుస్తుంటే, సుకుమార్‌తో సినిమా చెయ్యడానికి అల్లు అర్జున్ అతడిని కలిశాడని ఎవరో సుభాష్ గారికి చెప్పారంట.
కొడుకుకు వ్యతిరేకంగా అరవింద్‌కు ఎవరో ఫిర్యాదులు చేస్తుంటే, తండ్రికి వ్యతిరేకంగా అర్జున్‌కు వార్తలు మోసుకెళ్తున్నారంట. దీంతో ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయంట. ఇంతకంటే కామెడీ ఏమైనా ఉందా!
పిల్లలనే కాదు, తన కుటుంబం విషయంలోనే కాకుండా తన వాళ్లనుకున్నవాళ్ల విషయంలోనూ అరవింద్ ఎంత ఆత్మీయంగా ఉంటారో చాలామందికి తెలిసిన విషయమే. మెగా కాంపౌండులోని హీరోలతోటే సరిపెట్టకుండా బయటి హీరోలతోనూ సినిమాలు చెయ్యాలని అరవింద్ అనుకోవడాన్ని కూడా నెగటివ్‌గా తీసుకొనేవాళ్లను ఏమనాలి? అని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
అల్లు అరవింద్‌కూ బన్నీకీ మధ్య తీవ్ర కలహాలా? | actioncutok.com
You may also like: