Hippi Teaser Launch By Nani


నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా హిప్పీ టీజ‌ర్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా హిప్పీ టీజ‌ర్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా హిప్పీ టీజ‌ర్ విడుద‌లైంది. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను వీ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తుండగా… టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టీజ‌ర్‌ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘కార్తికేయ‌తో క‌లిసి ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో ప‌నిచేస్తున్నాను. ఈ ప‌రిచ‌యంతోనే నేను ‘హిప్పీ’ టీజ‌ర్‌ విడుద‌ల చేశాను. ‘హిప్పీ’ టీజ‌ర్‌ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా చాలా బావుంది. స‌క్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ ల‌క్ష‌ణాలు, వైబ్రేష‌న్స్ ఇందులో ఉన్నాయి. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుందని న‌మ్ముతున్నా’ అని అన్నారు.

కార్తికేయ మాట్లాడుతూ ‘నాని సార్‌తో ప‌నిచేసే ఛాన్స్ నాకు ‘గ్యాంగ్‌లీడ‌ర్‌’ చిత్రంతో వ‌చ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజ‌ర్ లాంచ్ ఆయ‌న చేతుల మీదుగా జ‌రిపించాల‌ని అనుకున్నా. నేను అడ‌గ్గానే అంగీక‌రించారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. ఆయ‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌గ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు.

నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ ‘రెండు పాట‌లు మినహా షూటింగ్ పూర్త‌యింది. ఒక పాట‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాట‌ను ప‌బ్బులో చిత్రీక‌రిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు ఈ షూటింగ్ ఉంటుంది. టీజ‌ర్ చాలా బావుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌రీతిలో నిర్మిస్తున్నాం. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం’ అని చెప్పారు.

నటీనటులు:
కార్తికేయ, జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా హిప్పీ టీజ‌ర్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా హిప్పీ టీజ‌ర్ విడుద‌ల‌ | actioncutok.com

You may also like: