Hugh Jackman & Rebecca Ferguson reunite for Reminiscence


Hugh Jackman & Rebecca Ferguson reunite for Reminiscence

‘ఎక్స్ మెన్’ ఫేం హగ్ జాక్‌మన్, ‘మిషన్ ఇంపాజిబుల్: ఫాలౌట్’ ఫేం రెబక్కా ఫెర్గూసన్ మరోసారి కలిసి నటించేదుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఆ సినిమా పేరు ‘రెమినిజెన్స్’. ‘వెస్ట్‌వరల్డ్’ ఫేం లీసా జాయ్ స్క్రిప్ట్ సమకూరుస్తూ డైరెక్ట్ చేసే ఈ సినిమా ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ సొంతం చేసుకుంది. హగ్, రెబక్కా ఇదివరకు 2017లో వచ్చిన మ్యూజికల్ ఫిల్మ్ ‘ద గ్రేటెస్ట్ షోమ్యాన్’లో కలిసి నటించారు.

‘రెమినిజెన్స్’ అనేది నిక్ బానిస్టర్ (జాక్‌మన్) అనే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కథ. ఒక మిస్టీరియస్ గాళ్ (రెబక్కా)ని కలుసుకున్నప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునుగుతాడు నిక్. హఠాత్తుగా ఒకరోజు ఆమె కనిపించకుండా పోవడంతో అతను దిక్కుతోచని స్థితిలో పడతాడు. ఆమె కోసం అన్వేషణ మొదలుపెట్టిన అతడికి ఆమె గురించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు ఒక్కొక్కటిగా తెలుస్తాయి.

ఈ శరత్కాలంలోనే చిత్రీకరణ మొదలు కానున్నది.