ఇస్మార్ట్ శంకర్: డేట్ నైట్ ఎట్ గోవా!


ఇస్మార్ట్ శంకర్: డేట్ నైట్ ఎట్ గోవా!

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేశ్ నాయికలుగా నటిస్తున్నారు. లావణ్య సమర్పిస్తుండగా, ఛార్మి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది.

షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాక ఛార్మితో కలిసి నైటవుట్ చేసిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం పేజీ ద్వారా షేర్ చేసింది నభా. “ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, డు యు వండర్ వాట్ గాళ్స్ నైటవుట్స్ ఆర్?” అనే క్యాప్షన్‌ను దానికి జోడించింది. ‘డేట్‌నైట్’, ‘థాయ్‌ఫుడ్’ అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జోడించింది నభా.

మరో వైపు ఛార్మి సైతం గోవా బీచ్‌లో ‘పెట్స్’తో సరదాగా ఆడుతున్న ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా  షేర్ చేసింది. “వెన్ దే బార్క్ ఎట్ బిగ్ డాగ్స్.. పెట్స్ ఇన్ గోవా” అని ట్వీట్ చేసింది.

మేలో ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల కానున్నది.

More on iSmart Shankar: