వెల్లడైంది: నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19న వస్తోంది


వెల్లడైంది: నాని 'జెర్సీ' ఏప్రిల్ 19న వస్తోంది

వెల్లడైంది: నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19న వస్తోంది

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తోన్న ‘జెర్సీ’ సినిమా ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేపుతోంది. స్పోర్ట్స్ మేగజైన్ తరహాలో ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ‘ఇష్యూ-16, 1996’గా దాన్ని పేర్కొన్నారు.

“96 రంజీ స్పెషల్ ఎడిషన్” అని దానిపై పేర్కొనడాన్ని బట్టి ఈ సినిమా నేపథ్యాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పదేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న అర్జున్ అనే 36 సంవత్సరాల క్రికెటర్ మళ్లీ 1996 రంజీల్లో ఆడటానికి చేసిన కృషి ఈ సినిమా, జెర్సీ, కథగా మనం చెప్పుకోవచ్చు.

“కలగనడానికి మరీ ఆలస్యం చేయడమనేది ఉండదు” అనే అర్జున్ మాటలు కూడా ఆ పోస్టర్‌పై ఉన్నాయి. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడటం మరీ ఆలస్యం చేయడం కాదని, ఎంతకాలానికైనా కలను సాకారం చేసుకోవచ్చనీ ఆ మాటల ద్వారా అర్జున్ మనకు చెబ్తున్నాడు. అది అన్నిట్నీ, ఎప్పటికీ మార్చేస్తుందని కూడా నాని అంటున్నాడు.

శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా నటిస్తున్న జెర్సీ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

వెల్లడైంది: నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19న వస్తోంది

Related articles: