లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2: లక్ష్మీపార్వతి కథకు మెయిన్ విలన్లు చంద్రబాబు, భువనేశ్వరి!


లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2: లక్ష్మీపార్వతి కథకు మెయిన్ విలన్లు చంద్రబాబు, భువనేశ్వరి!

ఎన్టీఆర్ బయోపిక్‌గా బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలు ఒక విధంగా ఒన్ సైడెడ్‌గా ఉన్నాయనుకుంటే, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇంకోవిధంగా ఒన్ సైడెడ్‌గా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

లక్ష్మీపార్వతిని పూర్తిగా పాజిటివ్ కోణంలోనూ, చంద్రబాబును పూర్తిగా నెగటివ్ కోణంలోనూ ఆర్జీవీ చిత్రించినట్లు రెండో ట్రైలర్ చాలా స్పష్టంగా చూపిస్తోంది. కేవలం చంద్రబాబునే కాదు, ఎన్టీఆర్ కూతుళ్లలో చంద్రబాబు భార్య అయిన భువనేశ్వరిని కూడా ఆర్జీవీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.

“వాడూ, నా పిల్లలూ కలిసి, నన్ను చంపేశారు” అని ఎన్టీఆర్ అన్న మాటలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవగా ట్రైలర్ మొదలవుతుంది. అలా డైరెక్టుగానే తన చావుకు కారణం ఎవరో ఎన్టీఆర్ చెప్పినట్లు చిత్రించారు డైరెక్టర్స్. తనను ఇంతవాణ్ని చేసిన ప్రజలే ఇప్పుడు వద్దనుకుంటున్నారనీ, అధికారం నుంచి దూరం చేశారనీ ఎన్టీఆర్ బాధపడతాడు.

లక్ష్మీపార్వతిని ఉద్దేశించి ఎన్టీఆర్‌తో చంద్రబాబు “మీరనుకున్నట్లు ఆమె అంత మంచి మనిషి కాదు. ఇప్పటికే ఆమెకు ఎంతోమందితో ఎఫైర్స్ ఉన్నాయనీ..” అని ఇంకా చెప్పబోతుంటే, ఎన్టీఆర్ వారిస్తాడు. ఆమె వ్యక్తిత్వం విషయంలో చంద్రబాబుకు మొదట్నుంచీ చులకన భావం ఉన్నదన్నట్లు చూపిస్తున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2: లక్ష్మీపార్వతి కథకు మెయిన్ విలన్లు చంద్రబాబు, భువనేశ్వరి!

“శ్రీదేవి, జయసుధ, జయప్రదల్లాంటి మహా మహా అందగత్తెలతో పరిచయమున్న ఆయనకి దాన్లో ఏముందనో..” అని భువనేశ్వరి చికాగ్గా అనడం అబ్రప్టుగా అనిపిస్తుంది. వర్మ ఉద్దేశపూర్వకంగా అలాంటి డైలాగ్స్ పెట్టినట్లు కనిపిస్తుంది.

ఆ డైలాగ్‌ను బట్టి ఆ హీరోయిన్లలో లేనిదేమైనా లక్ష్మీపార్వతిలో కనిపించిందా అనే అర్థం ఆమె మాటల్లో ధ్వనిస్తోంది. ఆ ముగ్గురు హీరోయిన్లలో ఎవరో ఒకరైతే ఓకేనే అనే భావమూ ఆ డైలాగ్‌లో ధ్వనిస్తోంది.

“ముండా” అంటూ భువనేశ్వరి చెంపపై కొడితే, “మీరు కొట్టినా, పొడిచినా, చంపినా నేనిక్కడకు వచ్చింది ఆయనకు సేవ చేసుకోడానికే” అంటుంది లక్ష్మీపార్వతి. ఈ సన్నివేశంలో విలన్ భువనేశ్వరి, హీరోయిన్ లక్ష్మీపార్వతి.

“దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ కావాలి” అని హరికృష్ణతో అంటాడు చంద్రబాబు. దాంతో ఎన్టీఆర్ కుటుంబం కూడా చంద్రబాబుకు పూర్తిగా సహకరించిందని అర్థం చేసుకోవాలి.

అక్కడ్నుంచి లక్ష్మీపార్వతిని తక్కువచేస్తూ, ఎన్టీఆర్‌ని ఆమె కీలుబొమ్మలా చేసి ఆడిస్తోందనీ, పార్టీని సర్వనాశనం చేస్తోందనే ప్రచారాన్ని చంద్రబాబు వర్గం ఒక పద్ధతి ప్రకారం అమలు చేసినట్లు చూపించాడు ఆర్జీవీ.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2: లక్ష్మీపార్వతి కథకు మెయిన్ విలన్లు చంద్రబాబు, భువనేశ్వరి!

వైస్రాయ్ హోటల్ ఉదంతం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెనెక్కితే, ఎన్టీఆర్ “నమ్మించి, వంచించి, వెన్నుపోటు పొడిచారు” అంటూ వాపోతాడు.

ఎన్టీఆర్ “మన దగ్గర నిజముంది. నిజాన్ని ఎవ్వరూ ఆపలేరు” అంటాడు. ఆ వెంటనే నేపథ్యంలో “గర్జన.. సింహగర్జన” అనే ఆవేశపూరిత మాటలు వినిపిస్తాయి.

ఆ తర్వాత చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్తాడని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇందులో బాలకృష్ణ కేరెక్టర్ కూడా ఉంది. కళ్లకు పెద్ద గాగుల్స్ పెట్టుకొని, జెర్కిన్ వేసుకొని సినిమా యాక్టర్ అనిపించేట్లు ఆ పాత్ర ఆహార్యాన్ని మలిచాడు ఆర్జీవీ. సినిమాలో బాలకృష్ణ ఎప్పుడు కనిపించినా అదే ఆహార్యంతో కనిపిస్తాడన్న మాట.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2: లక్ష్మీపార్వతి కథకు మెయిన్ విలన్లు చంద్రబాబు, భువనేశ్వరి!