ఒంటిపై మంటలంటించుకున్న అక్షయ్ కుమార్!


ఒంటిపై మంటలంటించుకున్న అక్షయ్ కుమార్!

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ డూప్ లేకుండా స్టంట్స్ చేయడంలో పేరు పొందాడు. అదే తరహాలో ఒంటికి మంటలు అంటించుకొని స్టేజిపై ప్రదర్శన ఇచ్చి అందర్నీ ఆశ్చర్యంతో పాటు, కాస్త ఆందోళనకూ గురిచేశాడు. ఇది అమెజాన్ ప్రైమ్ కోసం తను చేయబోతున్న వెబ్ సిరీస్ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రాం కోసం ఇచ్చిన ప్రదర్శన.

ఆ వెబ్ సిరీస్ వర్కింగ్ టైటిల్ ‘ది ఎండ్’. అయితే ఇది తనకు బిగినింగ్ మాత్రమేనని సరదాగా ట్వీట్ చేశాడు అక్షయ్. ప్రస్తుతం యువతలో వెబ్ సిరీస్ క్రేజ్ పెరిగింది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఆన్‌లైన్ చానళ్లలో వస్తోన్న వెబ్ సిరీస్‌కు యువత ఎడిక్ట్ అవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ వెబ్ సిరీస్ చెయ్యడానికి ముందుకొచ్చాడు అక్షయ్.

కాగా అక్షయ్ అలా వంటికి మంటలు అంటించుకొని చేసిన ప్రదర్శన అతని భార్య ట్వింకిల్ ఖన్నాకు ఆందోళన కలిగించినట్లుంది. “ఇంటికి రా నీ పని చెబుతా” అని ట్విట్టర్ ద్వారానే అతడిని సరదాగా బెదిరించింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

One thought on “ఒంటిపై మంటలంటించుకున్న అక్షయ్ కుమార్!

Comments are closed.