ఆశీర్వాదాల జడిలో ‘మా’ నూతన అధ్యక్షుడు నరేష్


పలువురు ప్రముఖుల ఆశీర్వాదాలు తీసుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు నరేష్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడిగా నటుడు వీకే (సీనియర్) నరేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమైన పదవులకు నరేష్ ప్యానల్ తరపున పోటీచేసిన సభ్యుల్లో ఎక్కువమంది విజయం సాధించారు.

ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, సంయుక్త కార్యదర్శిగా గౌతమ్‌రాజు, శివబాలాజీ విజయం సాధించారు.

కాగా మా ఎన్నికల లో గెలుపొందిన వీకే నరేష్ ప్యానెల్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన నరేష్ ప్యానెల్ సభ్యులు సూపర్ స్టార్ కృష్ణ గారితో కాసేపు ముచ్చటించి బాగోగులు తెలుసుకున్నారు.

పలువురు ప్రముఖుల ఆశీర్వాదాలు తీసుకున్న 'మా' నూతన అధ్యక్షుడు నరేష్

ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ని గౌరవపూర్వకంగా కలిశారు. మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి ఇంత ఘన విజయం పొందేందుకు సహకరించినందుకు మా అధ్యక్షుడు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు.

పలువురు ప్రముఖుల ఆశీర్వాదాలు తీసుకున్న 'మా' నూతన అధ్యక్షుడు నరేష్

ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారినిని మర్యాద పూర్వకంగా కలిశారు. అయన అంతే మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుని అయన పలు హామీలు ఇచ్చారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనుంటాను, ‘మా’ అభివృద్ధికి , కళాకారుల బాగోగులు చూసుకునేలా అన్ని విధాలా సహకరిస్తాను అని అయన హామీ ఇచ్చారు. నరేష్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పలువురు ప్రముఖుల ఆశీర్వాదాలు తీసుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు నరేష్ | actioncutok.com

You may also like: