మహర్షి: షాట్ గ్యాప్‌లో…


మహర్షి: షాట్ గ్యాప్‌లో...

మహేశ్ టైటిల్ రోల్ చేస్తోన్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ చివరి దశకొచ్చింది. వంశీ పైడిపల్లి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయిక. సి. అశ్వినీదత్, దిల్ రాజు, పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు. మే 9న చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించినట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. 17వ తేదీతో టాకీ పార్ట్ పూర్తి కానున్నది. దాని తర్వాత మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉంటాయి. వాటిని కూడా త్వరలోని చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది.

కాగా శనివారం షూటింగ్ మధ్యలో తన సినీ బృందంతో పిచ్చాపాటీ మాట్లాడుతున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేశాడు మహేశ్.

“ఇన్‌బిట్వీన్ షాట్స్! విత మై మోస్ట్ ప్యాషనేట్ అండ్ హార్డ్‌వర్కింగ్ టీం” అనే క్యాప్షన్‌ను జోడించాడు. ‘బెస్ట్ ఈజ్ యెట్ టు కం’ అనే హ్యాష్‌టాగ్ కూడా దానికి పెట్టాడు. కొద్ది సేపట్లోనే ఈ ఫొటో ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

‘భరత్ అనే నేను’ వంటి హిట్ తర్వాత మహేశ్ చేస్తున్న ఈ సినిమా 2019లో రానున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఒకటి.

మహర్షి: షాట్ గ్యాప్‌లో...
మహర్షి: షాట్ గ్యాప్‌లో...
మహర్షి: షాట్ గ్యాప్‌లో...
మహర్షి: షాట్ గ్యాప్‌లో...

One thought on “మహర్షి: షాట్ గ్యాప్‌లో…

Comments are closed.