మహేశ్‌ను కలుసుకున్న అభిమాన బాలిక


మహేశ్‌ను కలుసుకున్న అభిమాన బాలిక

మహేశ్‌ను కలుసుకున్న అభిమాన బాలిక

ఆ అమ్మాయి సూపర్‌స్టార్ మహేశ్ అభిమాని. పేరు పర్వీన్ బైబి. ఎలాగైనా మహేశ్‌ను కలవాలని తపించిపోతూ ఉండేది. కానీ చిన్న వయసులోనే ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి గురయ్యింది ఆ బాలిక. శ్రీకాకుళంకు చెందిన ఆమె విషయం మహేశ్‌కు తెలిసింది. తనను ఒక్కసారి కలుసుకోవాలన్న ఆమె కోరికను తీర్చాలనుకున్నాడు.

హైదరాబాద్‌లో తనను కలుసుకొనే ఏర్పాట్లు చేశాడు. కుటుంబంతో వచ్చి మహేశ్‌ను కలుసుకొని, అతనితో మాట్లాడి మురిసిపోయింది పర్వీన్. ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన మహేశ్ ఆమె జబ్బు త్వరగా నయమైపోతుందనీ, ఏం భయపడాల్సిన పని లేదనీ ధైర్యం చెప్పాడు.

తన అభిమాన హీరోను కలుసుకుంటానని ఊహించని పర్వీన్, ఇప్పుడు మహేశ్‌ని కలవడమే కాదు, తనతో అతడు మాట్లాడటంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఆ చిన్నారికి సోకిన జబ్బు త్వరగా నయమై, పూర్తి ఆరోగ్యంతో చలాకీగా మారాలని కోరుకుందాం.

మహేశ్‌కు సంబంధించిన ఇంకో విషయం కూడా తెలిసింది. ఇటీవల ‘మహర్షి’ సెట్స్‌పై కృష్ణారావు అనే లైట్‌మేన్ మరణించగా, అతని కుటుంబానికి రూ. 2 లక్షలు సాయం చేశాడు.

మహేశ్‌ను కలుసుకున్న అభిమాన బాలిక

మహేశ్‌ను కలుసుకున్న అభిమాన బాలిక | actioncutok.com

You may also like: