‘మనసా వాచా’ రివ్యూ: రెండడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి


'మనసా వాచా' రివ్యూ: రెండడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి

‘మనసా వాచా’ రివ్యూ: రెండడుగులు ముందుకి – రెండడుగులు వెనక్కి

తారాగణం: తేజస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్, తాగుబోతు రమేశ్

దర్శకుడు: ఎం.వి. ప్రసాద్

విడుదల తేదీ: 15 మార్చి, 2019

మనసా వాచా చిత్రం ద్వారా వచ్చే లాభాల్లో సగం కేన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నామని నిర్మాతలు ప్రకటించడం ఈ సినిమా వెనకున్న మానవీయ కోణం.

కథ:

కేన్సర్ రీసెర్చ్ సైంటిస్ట్స్ గా పని చేసే ఇద్దరు ఎన్.ఆర్.ఐ.ల మధ్య లండన్ నేపథ్యంలోలో నడిచే ప్రేమ కథ ఈ సినిమా. మహమ్మారిలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నకేన్సర్‌కు అతి తేలికైన నివారణ పద్ధతుల్ని కనిపెట్టడానికి వాళ్లు కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో

యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న మెడికల్ మాఫియా వల్ల వాళ్ల ప్రేమకు, వారి జీవితాలకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురయ్యాయి, వాటిని వాళ్లెలా అధిగమించారనేది ఇందులోని ప్రధానాంశం.

కథనం

ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించే. ఈ సినిమాలో ఈ మాత్రం కథన చాతుర్యం ఉంటుందని మనం ఊహించలేం. ఈ తరహా కథలను సాధారణంగా తెలుగులో చూడం. ఒక క్లిష్టమైన కథాంశాన్ని తీసుకొని, ‘ఓహో’ అనిపించలేకపోయినా, బాగానే తీశాడనిపించాడు దర్శకుడు.

అతని పేరు వినడం ఇదే తొలిసారి. ఒక పేరున్న బేనర్ నుంచి పరిచయమయ్యే దర్శకుడి గురించి ఆసక్తి కనపరుస్తాం కానీ, అంతా కొత్తవాళ్లే కనిపించే సినిమా తీసిన దర్శకుడి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ఎం.వి. ప్రసాద్ అనే ఈ దర్శకుడు సన్నివేశాల కల్పనలో మరింత శ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో రాణిస్తాడని చెప్పవచ్చు. ద్వితీయార్థంలో అతడు ప్రవేశపెట్టిన మలుపులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

'మనసా వాచా' రివ్యూ: రెండడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి
తారల అభినయం

హీరో తేజస్, హీరోయిన్లు కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ కొత్తవాళైనా బాగానే చేశారనిపిస్తుంది. తేజస్‌లో ఈజ్ ఉంది. సానపెడితే ఇంకా రాణిస్తాడు. భావోద్వేగాలు ప్రదర్శించేటప్పుడు ఇంకాస్త పరిణతిని ప్రదర్శించాలి. మిగతా పాత్రల్లో నటించిన లండన్ గణేష్, తాగుబోతు రమేష్, నవీన్ వంటివాళ్లు పరిధి మేరకు బాగానే నటించారు. అందరి నుంచి మంచి ఔట్ పుట్ తీసుకోవడంలో సఫలమయ్యాడు దర్శకుడు.

సాంకేతిక అంశాలు

మనసా వాచా సినిమాకి సంబంధించిన బలాల్లో చెప్పుకోదగ్గది సినిమాటోగ్రఫీ. లండన్ అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే.. సన్నివేశాలకు తగ్గ మూడ్‌ని ఎలివేట్ చేసింది. కేశవ్ కిరణ్ అందించిన సంగీత బాణీలు ఓకే. నేపథ్య సంగీతం  బాగుంది.

అరుణ్ బుర్రా మాటలు, పాటలు కూడా మంచి మార్కులే తెచ్చుకుంటాయి. అయితే ఎడిటర్ కాస్త ఉదారంగా ఉన్నాడనిపించింది. సినిమా అందంగా రావాలంటే అవసరమైన చోట కత్తెరకు మొహమాటం లేకుండా పని చెప్పాల్సిందే.

చివరి మాట

కథాంశం పరంగా ప్రోత్సహించదగ్గ ప్రయత్నం. వైవిధ్యమైన కథలను తెరపై చూడాలనుకొనేవారు ఒకసారి చూడదగ్గ సినిమా.

‘మనసా వాచా’ రివ్యూ: రెండడుగులు ముందుకి – రెండడుగులు వెనక్కి | actioncutok.com

You may also like: