‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ రివ్యూ: ఐదడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి


'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' రివ్యూ: ఐదడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి

‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ రివ్యూ: ఐదడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి

తారాగణం: అభిమన్యు దస్సాని, రాధికా మదన్, గుల్షన్ దేవయ్య, మహేశ్ మంజ్రేకర్, జిమిత్ త్రివేది

దర్శకత్వం: వాసన్ బాల

విడుదల తేదీ: మార్చి 21

బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్థానంలో భిన్న కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. ఆ పరంగా చూస్తే మరింత భిన్నమైన కథాంశంతో కూడిన సినిమాగా ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ను చెప్పుకోవాలి. వాసన్ బాలా రూపొందించిన ఈ సినిమా బాలీవుడ్‌ను మరింత మార్పుకు గురిచేసే సినిమాగా నిలిచే అవకాశం ఉంది.

'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' రివ్యూ: ఐదడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి
కథ

ఇది ఒక అరుదైన శారీరక స్థితి కలిగిన యువకుని కథ. అతడికి నొప్పి అంటే ఏమిటో తెలీదు. ఎవరైనా అతడిని కొట్టాలని చూస్తే దానికి ఎలా స్పందించాలో నేర్చుకొమ్మని అతడికి తాత బోధిస్తాడు. కొన్ని చర్యలు, వాటి ప్రతిస్పందలు ఎలా నొప్పిని కలిగిస్తాయో చెప్పి, నొప్పి కలుగుతుందనుకున్నప్పుడు ‘ఔచ్’ అని చెప్పమంటాడు. అలాగే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి మనవడ్ని తాత ప్రోత్సహిస్తాడు.

ఒకరోజు సూర్య అనే ఆ మనవడు ఒక కాలు మాత్రమే ఉన్న కరాటే మణి వంది మందితో ఫైటింగ్ చెయ్యడం చూస్తాడు. కొన్నేళ్ల తర్వాత తన ఆరాధ్య వీరుడు కరాటే మణిని కలుసుకొనే అవకాశం అతడికి వస్తుంది. మణి కవల సోదరుడు, దుష్టుడు అయిన జిమ్మీ వల్ల మణి, సూర్య ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నారు, తన చిన్ననాటి ప్రియ నేస్తం సుప్రితో సూర్య మళ్లీ ఎలా జత కలిశాడన్నది మిగతా కథ.

'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' రివ్యూ: ఐదడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి
కథనం

ఈ సినిమాకు అతి పెద్ద బలాలు దర్శకత్వం, కథన చాతుర్యం. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఆడవాళ్లు, దివ్యాంగులు పనికిరారనే అభిప్రాయంతో ఉందేవాళ్లకు కనువిప్పు కలిగించే సినిమాగా దీన్ని రూపొందించాడు దర్శకుడు. మూస పద్ధతులకు భిన్నంగా ఈ సినిమాలో స్త్రీలు, దివ్యాంగులు బలమైనవాళ్లుగా, స్వతంత్రంగా ఆలోచించేవాళ్లుగా దర్శనమిస్తారు.

పెద్దయ్యాక మన జీవితం ఎలా ఉంటుందనేది బాల్యమే నిర్దేశిస్తుందనే విషయాన్ని ఈ సినిమాతో బలంగా చెప్పాడు వాసన్ బాల. సూర్య అన్యాయాల్ని ఎదుర్కొనే ధీరుడిగా రూపొందడం, సుప్రి సామాజిక కార్యకర్తగా మారడం అందులో భాగం. సూర్య, అతని తండ్రి మధ్య సన్నివేశాలు, సూర్య, తాత మధ్య సన్నివేశాలను కల్పించిన తీరుకు అబ్బురపడతాం.

యాక్షన్ సన్నివేశాలను కల్పించిన తీరు కూడా అంతే. సూర్యతో పాటు మనం కూడా ‘ఔచ్’ అనకుండా ఉండలేం. మార్షల్ ఆర్ట్స్ ప్రియులైతే ఆ ఫైట్లను తెగ ఆస్వాదిస్తారు. డైరెక్టర్ కల్పించిన కామెడీ సన్నివేశాలు అంతగా పండటానికి కారణం నటుల కామెడీ టైమింగ్ కూడా.

అంచనాలకు అందని కథ, సన్నివేశాలతో చివరాఖరి దాకా మనం సీట్లకు అతుక్కుపోతామంటే అతిశయోక్తి కాదు. కొన్ని సన్నివేశాలు ఓవర్‌గా, లాజిక్‌కు అందనివిగా అనిపించినా, వినోదంతో వాటిని మనం మర్చిపోతాం. ప్రథమార్థంలో విపరీతంగా నవ్వే మనం, ద్వితీయార్థంలో వచ్చే ఫైట్లకు ఊగిపోతాం, మెలోడ్రామాకు కదిలిపోతాం.

'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' రివ్యూ: ఐదడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి
తారల అభినయం

నటులందరూ అదిరిపోయే అభినయాన్ని ప్రదర్శించారు. ‘మైనే ప్యార్ కియా’తో దేశాన్నంతా ప్రేమలో పడేసిన భాగ్యశ్రీ కొడుకు అభిమన్యు దస్సాని హీరోగా తన ముద్రను తొలి సినిమాతోటే వెయ్యగలిగాడు. సూర్య పాత్రలో చాలా బాగా రాణించాడు. ఫైట్స్ బ్రహ్మాండంగా చేశాడు. ‘పఠాకా’తో నాయికగా పరిచయమైన రాధికా మదన్ ఇందులో సుప్రి పాత్రలో చక్కగా ఇమిడిపోయింది. అభిమన్యుతో ఆమె కెమిస్ట్రీ పర్ఫెక్ట్.

అందరికంటే ఎక్కువ మార్కులు పొందేది మాత్రం మహేశ్ మంజ్రేకరే. తాత పాత్రలో అమోఘంగా ఆకట్టుకున్నాడు. కచ్చితమైన టైమింగ్‌తో కామెడీ పంచ్‌లు విసిరి అమితంగా అలరించాడు. కరాటే మణిగా, జిమ్మీగా కవల సోదరుల పాత్రలు పోషించిన గుల్షన్ దేవయ్య, ఆ రెండింటినీ విలక్షణంగా పోషించాడు. జిమ్మీగా కాస్త ఓవర్‌గా చేశాడని చెప్పాలి. అయినప్పటికీ ఆకట్టుకున్నాడు.

చివరి మాట

ఆద్యంతం అలరించే ఒక స్వచ్ఛమైన వినోదభరిత యాక్షన్ సినిమా. కుటుంబంతో హాయిగా ఆస్వాదించదగ్గ చక్కని సినిమా ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’.

– బుద్ధి యజ్ఞమూర్తి

‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ రివ్యూ: ఐదడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి | actioncutok.com

You may also like: