మోహన్‌లాల్ ‘బిగ్ బ్రదర్’


మోహన్‌లాల్ 'బిగ్ బ్రదర్'

తెలుగు సినిమాలు ‘జనతా గ్యారేజ్’, ‘మనమంతా’, డబ్బింగ్ సినిమా ‘మన్యంపులి’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ సూపర్‌స్టార్ త్వరలో ‘బిగ్ బ్రదర్’గా రాబోతున్నాడు. ‘ఒడియన్’ సినిమా అనూహ్య పరాజయం తర్వాత సబ్జెక్టుల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘మరక్కర్: అరబికండలింటే సింహం’ సినిమా మార్చిలో పూర్తి కానున్నది. దాని తర్వాత ఏక కాలంలో రెండు సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకటి – ‘ఇట్టిమణి: మేడ్ ఇన్ చైనా’ కాగా, మరొకటి – ‘బిగ్ బ్రదర్’. ఈ రెండూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే కావడం గమనార్హం.

‘ఇట్టిమణి’ సినిమా ఏప్రిల్‌లో మొదలై, సింగిల్ షెడ్యూల్‌లో పూర్తవుతుంది. జిబి, జోజు అనే నూతన జంట దర్శకులు ఈ సినిమాని రూపొందించనున్నారు. ఆ వెంటనే సిద్దిఖ్ డైరెక్షన్‌లో ‘బిగ్ బ్రదర్’ సినిమా చేయనున్నాడు మోహన్‌లాల్. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే తారాగణం ఎంపిక జరుగుతోంది.

One thought on “మోహన్‌లాల్ ‘బిగ్ బ్రదర్’

Comments are closed.