మోహన్‌బాబు చర్య చంద్రబాబును ఇరుకునపెట్టడానికేనా?


మోహన్‌బాబు చర్య చంద్రబాబును ఇరుకునపెట్టడానికేనా?

మోహన్‌బాబు చర్య చంద్రబాబును ఇరుకునపెట్టడానికేనా?

విలక్షణ నటుడు, శ్రీవిద్యా నికేతన్ సంస్థల ఛైర్మన్ మోహన్‌బాబును పోలీసులు గృహ నిర్బంధం కావించారు. తన విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిరసిస్తూ ఆయన ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీని అనుమతినివ్వలేమంటూ పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు.

“విద్యార్థుల ఫీజును ప్రభుత్వం ఎందుకు చెల్లించదు? నేను ర్యాలీ తలపెట్టింది విద్యార్థుల కోసం. దాన్ని వల్ల నాకొచ్చేదేమీ లేదు. రూ. 19 కోట్లు పెండింగులో ఉన్నాయి. తన కమిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఎందుకు నిలబెట్టుకోదు?” అని మోహన్‌బాబు ప్రశ్నించారు.

విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంట్ చెల్లించకపోవడానికి నిరసనగా ఇవాళ తిరుపతిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావించాననీ, కానీ తిరుపతిలోని తన ఇంటికి పోలీసులు వచ్చారనీ, చూస్తుంటే వాళ్లు ర్యాలీకి అనుమతిచ్చేట్లు లేరనీ ఇంతకు ముందు ఆయన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

అయితే ఎన్నికల వేళలోనే మోహన్‌బాబు ప్రభుత్వంపై నిరసన ప్రదర్శనలకు దిగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక రాజకీయ కోణం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉండటంతో మోహన్‌బాబు వైకాపాకు సానుభూతిపరుడిగా మారారంటున్నారు (ఆయన పెద్ద కోడలు విరానికా వైఎస్ తమ్ముని కుమార్తె).

ఫీజు రీఇంబర్స్‌మెంట్ అన్శం చాలా కాలంగా ఉన్నదే అయినా, ఇప్పుడు రచ్చ చేయడం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికేననీ, తద్వారా ఎన్నికల్లో తెదేపాకు నష్టం కలిగించవచ్చనేది దీని వెనుక ఉన్న అంతరార్థంగా తెదేపా నాయకులు అనుమానిస్తున్నారు.

మోహన్‌బాబు చర్య చంద్రబాబును ఇరుకునపెట్టడానికేనా? | actioncutok.com