సెన్సార్ బోర్డుతో 8 నెలల పోరాటం తర్వాత…


సెన్సార్ బోర్డుతో 8 నెలల పోరాటం తర్వాత...

సెన్సార్ బోర్డుతో 8 నెలల పోరాటం తర్వాత…

సెన్సార్ బోర్డుతో 8 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ సినిమా ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’ ఎట్టకేలకు విడుదల కాబోతోంది.

విద్వేషం, నగ్నత్వం, హింసలను ప్రొమోట్ చేసే విధంగా ఉన్నదని పేర్కొంటూ ఆ సినిమాపై 8 నెలలుగా నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చింది సెన్సార్ బోర్డ్. అయితే సెన్సార్ అభ్యంతరాల్ని తోసిపుచ్చుతూ అశ్విన్ కుమార్ చేసిన పోరాటం సత్ఫలితాన్నిచ్చింది. ఈ వారం మొదట్లో ఆ సినిమాకు ‘యు/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డ్ మంజూరు చేసింది.

అశ్విన్ కుమార్ రూపొందించిన ‘లిటిల్ టెర్రరిస్ట్’ అనే షార్ట్ ఫిల్మ్ అస్కార్ నామినేషన్‌ను పొందింది. అతడు తీసిన ‘ఇన్షల్లా ఫుట్‌బాల్’, ‘ఇన్షల్లా కశ్మీర్’ సినిమాలు జాతీయ పురస్కారాల్ని పొందాయి. కశ్మీర్ ట్రైలాజీలో ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’ మూడోది.

కశ్మీర్‌లో తండ్రుల్ని కోల్పోవడం వెనకున్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ప్రేమలో పడే ఇద్దరు టీనేజర్ల కథ ఈ సినిమా. గురువారమే ఈ సినిమా తొలి పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఇండియాలో ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

“ఎవ్విరివన్ థింక్స్ దే నో కశ్మీర్’ అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా ఏ కఠిన వాస్తవాన్ని చెబుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆశ, శాంతి, మానవత్వం వంటి ఎమోషన్స్‌తో కశ్మీర్ కథను తెరకెక్కించాడు అశ్విన్ కుమార్.

అశ్విన్ కుమార్ స్వయంగా ఒక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్, కుల్బూషన్ ఖర్బందా, అన్షుమన్ ఝా, మాయా సరావ్ కీలక పాత్రధారులు.

సెన్సార్ బోర్డుతో 8 నెలల పోరాటం తర్వాత… | actioncutok.com

You may also like:

One thought on “సెన్సార్ బోర్డుతో 8 నెలల పోరాటం తర్వాత…

Comments are closed.