Old Is Gold: 55 years of Kalavari Kodalu


Old Is Gold: 55 years of Kalavari Kodalu

Old Is Gold: 55 years of Kalavari Kodalu

మనిషిలో సహనం లోపిస్తే అసూయ, అనుమానం, అపోహలు తలెత్తి ఎడుటివాళ్లతో ఘర్షణ తలెత్తుతుందనీ, దాంపత్య జీవనంలో అయితే, అది కుటుంబంలోని అందరి వినాశనానికీ, ఆత్మ వినాశనానికీ దారి తీస్తుందనీ చెప్పే చిత్రం ‘కలవారి కోడలు’.

ఇది ఎన్టీఆర్ నటించిన 112వ చిత్రం. 1964 మార్చి 14న విడుదలైంది. రఘురాం ఫిలిమ్స్ బేనర్‌పై కె. హేమాంబరధరరావు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ జోడీగా కృష్ణకుమారి నటించిన ఈ చిత్రంలో గిరిజ, పద్మనాభం, గీతాంజలి, రమణారెడ్డి, సూర్యకాంతం, హేమలత, ప్రభాకరరెడ్డి, చలం ఇతర కీలక పాత్రధారులు.

సాహితీ రంగంలో పేరుపొందిన రచయిత నార్ల చిరంజీవి కథ, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి టి. చలపతిరావు సంగీతం సమకూర్చారు. సి. నారాయణరెడ్డి, నార్ల చిరంజీవి, కొసరాజు, ఆరుద్ర రాసిన పాటలు సంగీత ప్రియులను అలరించాయి.

ప్రధానంగా ‘నీ సొగసే లాగుతున్నాది’, ‘భలేగా నవ్వితివి’, ‘దొంగ చూపులు చూసీ’ పాటలు పాపులర్ అయ్యాయి. పాటలను ఎస్. జానకి, పి. సుశీల, ఘంటసాల, జిక్కి, సరస్వతి, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు ఆలపించారు.

ఎం.జి. సింగ్ ఛ్యాయాగ్రాహకునిగా పనిచేయగా, బి.ఎన్. కృష్ణ కళాదర్శకత్వం అందించారు. బి. గోపాలరావు ఎడిటింగ్ చేశారు.

Old Is Gold: 55 years of Kalavari Kodalu
కథ

డాక్టర్ ఆనంద్ (ఎన్టీఆర్) తన ఆప్తమిత్రుడు మరణిస్తే, అనాథగా మారిన అతని చెల్లెలు లత (కృష్ణకుమారి)ను తన ఇంటికి తీసుకొస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ బంధం చిగురిస్తుంది. ఒక రైలు ప్రమాదంలో లత చనిపోయినట్లు జాబితాలోని ఆమె పేరు చూసి బాధపడతాడు. మనసు మార్చుకొని మేన మరదలి (గిరిజ)ని పెళ్లి చేసుకుంటాడు.

ఆనాడు రైలు ప్రమాదంలో లతకు తీవ్ర గాయాలై, షాక్‌తో మాటలు రావడం లేదనీ, ఆమె బతికే ఉందనీ తెలుసుకున్న ఆనంద్, ఆమెను ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేస్తాడు. ఆమెకు తిరిగి మాట వస్తుంది. కానీ ఆనంద్ భార్య వాళ్లిద్దర్నీ అనుమానిస్తుంది. అలకతో పుట్టింటికి వెళ్లి తండ్రి మందలింపుతో వెనక్కి వస్తుంది.

ఆనంద్, లత కబుర్లు, కారులో తిరగడం చూసి, ఓర్పు కోల్పోయి, లతను చంపడానికి పాయసంలో విషం కలిపిస్తుంది. కానీ గ్లాసులు తారుమారై విషం ఉన్న పాయసాన్ని తానే తాగుతుంది. మరణించే ముందు నిజం చెబుతుంది. ఆ తర్వాత ఆనంద్, లత హాయిగా కారులో షికారుకు బయలుదేరతారు.

Old Is Gold: 55 years of Kalavari Kodalu

Old Is Gold: 55 years of Kalavari Kodalu | actioncutok.com

You may also like: