వరుణ్ ట్రైనర్ ఒలింపిక్ మెడలిస్ట్!


వరుణ్ ట్రైనర్ ఒలింపిక్ మెడలిస్ట్!

గత ఏడాది ‘తొలిప్రేమ’, ఈ ఏడాది ‘ఎఫ్2’ సినిమాల హిట్లతో కెరీర్‌లో మంచి జోష్ మీదున్నాడు వరుణ్‌తేజ్. ఈ ఏడాది మరో రెండు సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

వాటిలో ఒకటి తమిళ హిట్ ఫిల్మ్ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తయారవనున్న ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్‌ను వరుణ్ చేస్తున్నాడు. తమిళంలో ఈ రోల్‌ను బాబీ సింహా చేశాడు.

ఇది కాకుండా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే మరో సినిమానూ వరుణ్ చేయబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించే ఈ సినిమాలో బాక్సర్‌గా వరుణ్ కనిపించనున్నాడు. దీని కోసమే ఇటీవల అమెరికా వెళ్లి బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం వరుణ్‌కు బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి మాజీ బ్రిటిష్ బాక్సర్ టోనీ జెఫ్రీస్ రంగంలోకి వచ్చాడు. 2008 ఒలింపిక్స్‌లో టోనీ కాంస్య పతకం సాధించాడు. 2012లో బాక్సింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆగస్ట్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అల్లు వెంకటేశ్ (బాబీ), సందీప్ ముద్దా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

Tony Jeffries