పవన్ కల్యాణ్ ఆస్తులు రూ 52 కోట్లు, అప్పులు రూ 33 కోట్లు!


Pawan Kalyan

పవన్ కల్యాణ్ ఆస్తులు రూ 52 కోట్లు, అప్పులు రూ 33 కోట్లు!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీకి దిగుతున్నారు. ఒకటి విశాఖపట్నం జిల్లా గాజువాక అయితే, మరొకటి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. గురువారం గాజువాక స్థానానికి ఆయన నామినేషన్ ధాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులను వెల్లడించారు.

అందులో తనకు రూ. 33 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటిలో తాను పర్సనల్ లోన్స్ కింద తీసుకున్నట్లు చూపించిన వారిలో ఎక్కువమంది సినిమావాళ్లే ఉండటం గమనార్హం. దర్శకుడు త్రివిక్రంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ బాలాజీ సినీ మీడియా, ఎమార్ఎస్వీ ప్రసాద్, ప్రవీణ్‌కుమార్ నుంచి తాను వ్యక్తిగత రుణాలు తీసుకున్నానని ఆయన తెలిపారు.

అంతేకాదు, తన పెద్ద వదిన సురేఖ (చిరంజీవి భార్య) నుంచి కూడా అప్పు తీసుకున్నానని ఆయన తెలపడం గమనార్హం. వీటిలో ఎక్కువ భాగం ఆయన సినిమాలు చెయ్యడానికి తీసుకున్న అడ్వాన్సులని తెలుస్తోంది.

ఇక ఆస్తుల విషయానికి వస్తే, తన పేరిట రూ. 40.81 కోట్ల విలువ చేసే స్థిరాస్తులున్నాయని తెలిపారు. ఇక బ్యాంకు డిపాజిట్లు, ఆభరణాలు, వాహనాలు వంటి చరాస్తుల విలువ రూ. 12 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. వెరసి ఆయన ఆస్తులు రూ. 52.81 కోట్లుగా తెలిపారు. తన దగ్గర 4.76 లక్షలు, తన భార్య అన్నా లెజ్నోవా దగ్గర 1.53 లక్షల నగదు ఉన్నట్లు చూపించారు.

పవన్ కల్యాణ్ ఆస్తులు రూ 52 కోట్లు అప్పులు రూ 33 కోట్లు! | actioncuton.com

You may also like: