బన్నీ సరసన రెండోసారి!


బన్నీ సరసన రెండోసారి!
పూజా హెగ్డే

బన్నీ సరసన రెండోసారి! – actioncutok.com

అల్లు అర్జున్ సరసన రెండోసారి నటించేందుకు పూజా హెగ్డే సిద్ధమవుతోందా? అవుననే ప్రచారం అంతర్జాలంలో జోరుగా నడుస్తోంది. అర్జున్ తదుపరి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (హారికా అండ్ హాసినీ క్రియేషన్స్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారంటూ ప్రచారంలోకి వచ్చింది.

ఆ ప్రచారం నిజమే అయితే బన్నీ సరసన పూజ నటించడం ఇది రెండోసారవుతుంది. ఇదివరకు ఆ ఇద్దరూ ‘డీజే.. దువ్వాడ జగన్నాథం’లో జంటగా నటించారు. ఆ సినిమాలో ఆ ఇద్ధరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అలాగే త్రివిక్రంతో కలిసి పనిచెయ్యడం కూడా ఆమెకు రెండోసారే. త్రివిక్రమ్ మునుపటి సినిమా ‘అరవింద సమేత’లో అరవింద ఆమే.

పూజ ప్రస్తుతం తెలుగులో ‘మహర్షి’, హిందీలో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలు చేస్తోంది. కాగా బన్నీ సినిమాలో పూజ నాయికగా ఎంపికైన విషయాన్ని ఆ సినిమా వర్గాలు ధ్రువీకరించలేదు.

బన్నీ సరసన రెండోసారి! – actioncutok.com

You may also like: