క్విజ్: ‘పరుగు’ (2008) సినిమా నిజంగా మీకెంతవరకు గుర్తుంది?


క్విజ్: 'పరుగు' (2008) సినిమా నిజంగా మీకెంతవరకు గుర్తుంది?

క్విజ్: ‘పరుగు’ (2008) సినిమా నిజంగా మీకెంతవరకు గుర్తుంది?

‘బొమ్మరిల్లు’ అనే క్లాసిక్ మూవీతో డైరెక్టర్‌గా అడుగుపెట్టిన భాస్కర్ రూపొందించిన రెండో సినిమా ‘పరుగు’. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పెళ్లిరోజే తనకు చెప్పకుండా ప్రియుడితో లేచిపోతే ఆ తండ్రి ఎలాంటి వేదన చెందుతాడో, పరువు కోసం అతను ఏం చేస్తాడో ఈ సినిమా ద్వారా చూపించాడు భాస్కర్.

నీలకంఠ అనే ఆ తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించిన ఈ సినిమాలో అతని చిన్న కూతుర్ని ప్రేమించే హీరోగా అల్లు అర్జున్ అలరించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను విమర్శకులు పెద్దగా మెచ్చకున్నా ప్రేక్షకులు బాగా ఆదరించారు.

1. ప్రకాశ్‌రాజ్ పెద్ద కూతురు సుబ్బలక్ష్మి పాత్రధారి

ఎ) అభినయ   బి) పూనం బజ్వా   సి) పూనం కౌర్

2. ఈ సినిమా సంభాషణల రచయిత

ఎ) భాస్కర్   బి) వక్కంతం వంశీ  సి) బీవీఎస్ రవి

3. అల్లు అర్జున్ పాత్ర పేరు

ఎ) రాం  బి) కృష్ణ  సి) హరి

4. ఈ సినిమా ఛాయాగ్రాహకుడు

ఎ) విజయ్ చక్రవర్తి  బి) విజయ్ సి. కుమార్  సి) సెంథిల్ కుమార్

క్విజ్: 'పరుగు' (2008) సినిమా నిజంగా మీకెంతవరకు గుర్తుంది?

5. యజ్ఞనారాయణ శర్మగా కనిపించిన నటుడు

ఎ) సప్తగిరి  బి) ధనరాజ్  సి) చిత్రం శ్రీను

6. సుబ్బలక్ష్మి ఎక్కడ ఉందని ప్రకాశ్‌రాజ్ మనుషులకు చిత్రం శ్రీను చెబుతాడు?

ఎ) తిరుపతి  బి) విజయవాడ  సి) విశాఖపట్నం

7. ఈ సినిమా హిందీ రీమేక్ హీరో

ఎ) టైగర్ ష్రాఫ్  బి) వరుణ్ ధావన్  సి) రణ్‌వీర్ సింగ్

8. ‘పరుగులు తీయకె పసిదానా’ పాట రచయిత

ఎ) అనంత శ్రీరాం  బి) చంద్రబోస్  సి) సీతారామశాస్త్రి

9. మన పొరుగున ఉన్న ఏ దేశంలో ఈ సినిమా రీమేక్ అయ్యింది?

ఎ) శ్రీలంక  బి) నేపాల్  సి) బంగ్లాదేశ్

10. నాయిక షీలా పోషించిన పాత్ర పేరు

ఎ) మీనాక్షి  బి) కామాక్షి  సి) పల్లవి

క్విజ్: 'పరుగు' (2008) సినిమా నిజంగా మీకెంతవరకు గుర్తుంది?

జవాబులు:  1. పూనం బజ్వా  2. బీవీఎస్ రవి  3. కృష్ణ  4. విజయ్ చక్రవర్తి  5. సప్తగిరి  6. విశాఖపట్నం  7. టైగర్ ష్రాఫ్  8. సీతారామశాస్త్రి  9. నేపాల్  10. మీనాక్షి

క్విజ్: ‘పరుగు’ (2008) సినిమా నిజంగా మీకెంతవరకు గుర్తుంది? | actioncutok.com

You may also like:

One thought on “క్విజ్: ‘పరుగు’ (2008) సినిమా నిజంగా మీకెంతవరకు గుర్తుంది?

Comments are closed.