క్విజ్: జంధ్యాల ‘అహ నా పెళ్లంట’ (1987) సినిమా మీకెంతవరకు గుర్తుంది?


క్విజ్: జంధ్యాల 'అహ నా పెళ్లంట' (1987) సినిమా మీకెంతవరకు గుర్తుంది?

క్విజ్: జంధ్యాల ‘అహ నా పెళ్లంట’ (1987) సినిమా మీకెంతవరకు గుర్తుంది?

జంధ్యాల రూపొందించిన ‘అహ నా పెళ్లంట’ చిత్రం తెలుగు హాస్య చిత్రాల్లోనే ఆణిముత్యంగా నిలిచింది. అంతేకాదు, హాస్యనటులకు తెలుగు చిత్రసీమ కేరాఫ్ అడ్రస్‌గా నిలవడంలోనూ ఈ సినిమాయే కారణం. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంలను కెరీర్‌లో నిలబెట్టిన, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా చేసిన సినిమా కూడా ఇదే.

అసలు సిసలు పిసినారి అంటే ఎలా ఉంటాడో ఈ సినిమా చూస్తే చాలన్న రీతిలో కోట చేసిన పాత్ర మనకు చిరకాలం గుర్తుండిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో దర్శకునిగా జంధ్యాలకూ, హీరోగా రాజేంద్రప్రసాద్‌కూ తొలి చిత్రం ‘అహ నా పెళ్లంట’. అలాంటి సినిమాను క్విజ్ రూపంలో అవలోకనం చేసుకుందాం.

1. ఈ సినిమాకు ఆధారమైన ‘సత్యంగారి ఇల్లు’ నవల రచయిత

ఎ) ఆదివిష్ణు   బి) మల్లాది వెంకట కృష్ణమూర్తి   సి) శంకరమంచి పార్థసారథి

2. ఈ సినిమా సంగీత దర్శకుడు

ఎ) ఆర్.డి. బర్మన్   బి) చక్రవర్తి   సి) రమేశ్‌నాయుడు

3. రాజేంద్రప్రసాద్ తండ్రి కస్తూరి సత్యనారాయణ పాత్రధారి

ఎ) సుత్తి వీరభద్రరావు   బి) రాళ్లపల్లి   సి) నూతన్ ప్రసాద్

4. వేటూరి రాసిన ‘స్వాగతం ఈ దినం..’ పాటలో రాజేంద్రప్రసాద్‌లో కలిసి నర్తించిన తార

ఎ) అనూరాధ   బి) కుయిలీ   సి) డిస్కో శాంతి

5. కోట శ్రీనివాసరావు పోషించిన పిసినారి పాత్ర పేరు

ఎ) లక్ష్మీపతి   బి) సత్యం   సి) గిరిజాపతి

6. హైదరాబాద్ కాకుండా ఈ సినిమా షూటింగ్ జరిపిన తెలంగాణ గ్రామం

ఎ) హకీంపేట్  బి) దేవర యాంజాల్   సి) శామీర్‌పేట్

7. నత్తి గోవిందం పాత్ర చేసిన బ్రహ్మానందను కోట శ్రీనివాసరావు తిట్టే తిట్టు

ఎ) తిక్క సన్నాసి   బి) బుర్రతక్కువ వెధవ   సి) అరగుండు వెధవ

8. హాస్టల్ వార్డెన్‌గా కనిపించిన తార

ఎ) తెలంగాణ శకుంతల  బి) డబ్బింగ్ జానకి   సి) కుయిలీ

9. క్లైమాక్స్‌లో ఆర్టీసీ డ్రైవర్‌గా కనిపించే హాస్యనటుడు

ఎ) గుండు హనుమంతరావు   బి) సుత్తివేలు   సి) బాబూమోహన్

10. ఈ సినిమాకి వచ్చిన నంది అవార్డు

ఎ) ఉత్తమ చిత్రం   బి) ఉత్తమ హాస్యచిత్రం  సి) ఉత్తమ కుటుంబకథా చిత్రం

క్విజ్: జంధ్యాల 'అహ నా పెళ్లంట' (1987) సినిమా మీకెంతవరకు గుర్తుంది?

జవాబులు: 1. ఆదివిష్ణు  2. రమేశ్‌నాయుడు  3. నూతన్ ప్రసాద్  4. కుయిలీ  5. లక్ష్మీపతి  6. దేవర యాంజాల్  7. అరగుండు వెధవ  8. తెలంగాణ శకుంతల  9. బాబూమోహన్  10. ఉత్తమ హాస్యచిత్రం

క్విజ్: జంధ్యాల ‘అహ నా పెళ్లంట’ (1987) సినిమా మీకెంతవరకు గుర్తుంది? | actioncutok.com

More Quiz:

One thought on “క్విజ్: జంధ్యాల ‘అహ నా పెళ్లంట’ (1987) సినిమా మీకెంతవరకు గుర్తుంది?

Comments are closed.