Quiz: How well do you remember Chandramukhi?


Quiz: How well do you remember Chandramukhi?

రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘చంద్రముఖి’ సినిమా తమిళంలో ఎంత హిట్టయ్యిందో, తెలుగులోనూ అంత హిట్టయ్యింది. అది డబ్బింగ్ సినిమా అంటే ఒక పట్టాన నమ్మాలనిపించదు. టైటిల్ రోల్‌లో జ్యోతిక, రజనీ జోడీగా నయనతార నటించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకుడు.

సుమారు 14 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల నుంచి చెరిగిపోలేదు. అయినప్పటికీ ఆ సినిమా సంగతులు మనకెంతవరకు గుర్తున్నాయో తెలుసుకోవడానికే ఈ చిన్న క్విజ్.

1. ‘చంద్రముఖి’ ఏ మలయాళ చిత్రానికి రీమేక్?

ఎ) మాంపళక్కాలం   బి) మణిచిత్రతాళ్  సి) మళనూల్‌క్కణవు

2. రాజనర్తకి ప్రేమించే నాట్యాచార్యుడిగా కనిపించిన నటుడు

ఎ) అబ్బాస్   బి) వినీత్   సి) పృథ్వీరాజ్

3. ‘చంద్రముఖి’ ముందు ఇదే కథతో వచ్చిన కన్నడ ‘ఆప్తమిత్ర’లో ప్రధాన పాత్రధారి

ఎ) సౌందర్య   బి) రమ్యకృష్ణ   సి) ఆమని

4. తెలుగు వెర్షన్ ‘చంద్రముఖి’లో గతజన్మలో జ్యోతిక ఏ ప్రాంతం అమ్మాయిగా కనిపిస్తుంది?

ఎ) తమిళమ్మాయి   బి) తెలుగమ్మాయి   సి) కన్నడ అమ్మాయి

5. తమిళ ‘చంద్రముఖి’లో వచ్చే తెలుగు పాట ‘రారా సరసకు రారా’ గీత రచయిత

ఎ) వేటూరి   బి) వెన్నెలకంటి   సి) భువనచంద్ర

6. తెలుగు ‘చంద్రముఖి’ పాడే ‘వారాయ్.. నాన్ ఉన్నై తేడి’ గీత రచయిత

ఎ) వైరముత్తు   బి) వాలి   సి) నా. ముత్తుకుమార్

7. ‘చంద్రముఖి’ సంగీత దర్శకుడు

ఎ) ఇళయరాజా   బి) మణిశర్మ   సి) విద్యాసాగర్

8. సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు

ఎ) ఈశ్వర్  బి) విష్ణు   సి) అర్జున్

9. ఈ చిత్రానికి కళా దర్శకుడు

ఎ) అశోక్  బి) తోట తరణి  సి) ఆనంద్ సాయి

10. ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన బేనర్

ఎ) ఏవీఎం ప్రొడక్షన్స్   బి) విజయా ప్రొడక్షన్స్   సి) శివాజీ ప్రొడక్షన్స్

Quiz: How well do you remember Chandramukhi?

జవాబులు:  1. మణిచిత్రతాళ్  2. వినీత్  3. సౌందర్య  4. తమిళమ్మాయి  5. భువనచంద్ర  6. వాలి  7. విద్యాసాగర్  8. ఈశ్వర్  9. తోట తరణి  10. శివాజీ ప్రొడక్షన్స్