క్విజ్: ‘మర్యాద రామన్న’ సినిమా మీకెంతవరకు గుర్తుంది?


క్విజ్: 'మర్యాద రామన్న' సినిమా మీకెంతవరకు గుర్తుంది?

హీరోగా సునీల్ ప్రస్థానంలో కలికితురాయి లాంటి సినిమా ‘మర్యాద రామన్న’ (2010). ‘మగధీర’ లాంటి కెరీర్ బెస్ట్ సినిమా చేశాక మరో దర్శకుడైతే ఒక టాప్ స్టార్‌తో భారీ సినిమా చేసేవాడే. కానీ రాజమౌళి అందుకు భిన్నం. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సునీల్ హీరోగా ‘మర్యాద రామన్న’ తీసి ఘన విజయం సాధించాడు.

వారసత్వంగా తనకు సంక్రమించిన పొలాన్ని స్వాధీనం చేసుకోడానికి సొంత ఊరు వచ్చిన ఒక యువకుడికి ఎదురైన ప్రాణసంకట పరిస్థితులు, వాటి నుంచి తప్పించుకోడానికి అతను వేసే ఎత్తులతో ఆద్యంతం వినోదాన్ని పంచింది ఈ సినిమా. అది మనకు ఎంతవరకు జ్ఞాపకమున్నదో తెలుసుకోడానికి ఒక చిన్న క్విజ్.

1. ఈ సినిమాకు సంభాషణల రచయిత

ఎ) ఎం. రత్నం బి) ఎస్.ఎస్. కాంచి సి) వి. విజయేంద్రప్రసాద్

2. హీరోయిన్ సలోని పాత్ర పేరు

ఎ) రవళి బి) ఊర్మిళ సి) అపర్ణ

3) ఈ సినిమాలో సునీల్ సైకిల్‌కు వాయిస్ ఇచ్చిన హీరో

ఎ) నాని బి) రవితేజ సి) జూనియర్ ఎన్టీఆర్

4. ఈ సినిమా హిందీ రీమేక్

ఎ) సన్నాఫ్ సర్దార్ బి) సింగ్ ఈజ్ కింగ్ సి) తీస్ మార్ ఖాన్

5. ‘రాయె.. రాయె.. రాయె.. సలోని’ గీత రచయిత

ఎ) చైతన్య ప్రసాద్ బి) రామజోగయ్య శాస్త్రి సి) భాస్కరభట్ల

6. ఇది ఏ హాలీవుడ్ సినిమాకి కాపీ అనే పేరొచ్చింది?

ఎ) ద ప్రిన్సెస్ బ్రైడ్ బి) సేఫ్టీ లాస్ట్ సి) అవర్ హాస్పిటాలిటీ

7. ఈ సినిమాతో ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్న నటుడు

ఎ) సుప్రీత్ బి) నాగినీడు సి) ప్రభాకర్

8. ఈ సినిమా తమిళ రీమేక్‌లో హీరో

ఎ) వివేక్ బి) సూరి సి) సంతానం

9. ‘మర్యాద రామన్న’ కంటే ముందు రాజమౌళి తీసిన ఏ సినిమాలో సలోని నటించింది?

ఎ) మగధీర బి) ఛత్రపతి సి) సింహాద్రి

10. సినిమాలో ఉండి ఆడియోలో లేని పాట

ఎ) తెలుగమ్మాయి  బి) ఎన్నేండ్లకు పెద పండగ వచ్చె  సి) అమ్మాయి కిటికీ పక్కన

క్విజ్: 'మర్యాద రామన్న' సినిమా మీకెంతవరకు గుర్తుంది?

జవాబులు: 1. ఎస్.ఎస్. కాంచి 2. అపర్ణ 3. రవితేజ 4. సన్నాఫ్ సర్దార్ 5. చైతన్య ప్రసాద్ 6. అవర్ హాస్పిటాలిటీ 7. నాగినీడు 8. సంతానం 9. మగధీర 10. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చె

You May Like: