క్విజ్: వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించిన సినిమాలు మీకెంతవరకు గుర్తున్నాయి?

క్విజ్: వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించిన సినిమాలు మీకెంతవరకు గుర్తున్నాయి?
Sridevi and Nagarjuna in Aakhari Poratam

క్విజ్: వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించిన సినిమాలు మీకెంతవరకు గుర్తున్నాయి?

వైజయంతి కంబైన్స్, వైజయంతి మూవీస్ పతాకాలపై చలసాని అశ్వినీదత్ నిర్మించిన పలు సినిమాలు కమర్షియల్‌గా గొప్ప విజయాన్ని సాధించి, ఆయనను తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలబెట్టాయి. నిర్మాణ విలువలకు ఆయన సినిమాలు అద్దం పడతాయనే పేరు సంపాదించుకున్నారు. అగ్ర నటులతో, అగ్ర దర్శకులతోటే ఎక్కువగా ఆయన సినిమాలు నిర్మించారు. వాటిలో మనకెంతవరకు గుర్తున్నాయో తెలుసుకోవాడానికి ఈ చిన్న క్విజ్.

1. అక్కినేని, నాగేశ్వరరావు, కృష్ణ కలయికలో అశ్వినీదత్ నిర్మించిన చిత్రం

ఎ) హేమా హేమీలు   బి) గురుశిష్యులు  సి) ఊరంతా సంక్రాంతి

2. ‘క్షేమమా ప్రియతమా’ పాట ఉన్న చిత్రం

ఎ) అడవి సింహాలు  బి) అగ్నిపర్వతం  సి) బ్రహ్మరుద్రులు

3. అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేశ్ కలిసి నటించిన ‘బ్రహ్మరుద్రులు’ దర్శకుడు

ఎ) బి. గోపాల్  బి) కె. మురళీమోహనరావు  సి) యస్.యస్. రవిచంద్ర

4. నాగార్జున, శ్రీదేవి, సుహాసిని కలయికలో వచ్చిన ‘ఆఖరి పోరాటం’లో విలన్

ఎ) ప్రాణ్  బి) పరేష్ రావల్  సి) ఆమ్రిష్ పురి

5) వైజయంతి బేనర్‌పై కాకుండా కె. దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావులతో కలిసి అశ్వినీదత్ నిర్మించిన చిత్రం

ఎ) పెళ్లి సందడి  బి) పెళ్లాం చెబితే వినాలి  సి) అమ్మ రాజీనామా

6. ‘పెళ్లి సందడి’లో శ్రీకాంత్ కలల రాణి

ఎ) దీప్తి భట్నాగర్  బి) రవళి  సి) సాక్షి శివానంద్

7. జూనియర్ ఎన్టీఆర్‌తో నిర్మించిన ‘శక్తి’ సినిమా సంభాషణల రచయిత

ఎ) పరుచూరి బ్రదర్స్  బి) కొరటాల శివ  సి) సత్యానంద్

8. ‘అగ్ని పర్వతం’లో కృష్ణకు గొప్ప పేరు తెచ్చిన పాత్ర

ఎ) కృష్ణమనాయుడు  బి) జమదగ్ని  సి) రుద్రమనాయుడు

9. ‘ఇంద్ర’లో చిరంజీవి వారణాసిలో చలామణి అయ్యే పేరు

ఎ) ఆదినారాయణ  బి) శివనారాయణ  సి) శంకరనారాయణ

10. ‘గోదారి గట్టుపైన చిన్నారి చిలక ఉంది’ పాటలో కనిపించే హీరోయిన్

ఎ) ప్రీతి జింతా  బి) సిమ్రాన్  సి) నమ్రతా శిరోద్కర్

క్విజ్: వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించిన సినిమాలు మీకెంతవరకు గుర్తున్నాయి?

జవాబులు: 1. గురుశిష్యులు  2. అడవి సింహాలు  3. కె. మురళీమోహనరావు  4. ఆమ్రిష్ పురి  5. అమ్మ రాజీనామా  6. దీప్తి భట్నాగర్  7. సత్యానంద్  8. జమదగ్ని  9. శంకరనారాయణ  10. ప్రీతి జింతా

క్విజ్: వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించిన సినిమాలు మీకెంతవరకు గుర్తున్నాయి? | actioncutok.com

You may also like:

One thought on “క్విజ్: వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మించిన సినిమాలు మీకెంతవరకు గుర్తున్నాయి?

Comments are closed.