‘భారత్’ షూటింగ్ ముగిసింది.. సల్మాన్‌తో కత్రినా ఫొటో షేర్ చేసింది!


'భారత్' షూటింగ్ ముగిసింది.. సల్మాన్‌తో కత్రినా ఫొటో షేర్ చేసింది!
ఈ ఏడాది బాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ ఫిలింస్‌లో ఒకటైన ‘భారత్’ షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెలియజేశాడు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమాని ప్రకటించినప్పట్నుంచీ దీనిపై బజ్ అంతకంతకూ అధికమవుతూ వస్తోంది.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా సల్మాన్‌తో కలిసి దిగిన ఫొటోను మంగళవారం తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేసింది కత్రినా.
దానికి “ఇది ‘భారత్’ షూటింగ్ ముగిసిన సందర్భపు పిక్చర్. ఇందులో నేను నమ్మశక్యం కాని, ఉద్వేగభరితమైన పాత్ర చేశాను. ఈ సినిమా రూపొందిన విధానం మొత్తం ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది” అని ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించింది.
సల్మాన్ బావ అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న ఈ సినిమాలో టాబు, వరుణ్ ధావన్, దిశా పటాని, నోరా ఫతేహి, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.