నిహారికకు హిట్ కావలెను!


నిహారికకు హిట్ కావలెను!

నిహారికకు హిట్ కావలెను!

నిహారిక కొణిదెల! నాగబాబు ముద్దుల తనయ. వరుణ్‌తేజ్ ప్రియమైన చెల్లెలు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోని అబ్బాయిలు నటులుగా వస్తుంటారు కానీ అమ్మాయిలు రావడం బహు అరుదు. కృష్ణ కూతురు మంజుల నటిగా మారాక, ఆమెను మార్గదర్శకంగా చేసుకొని ఒక్కొక్కళ్లే ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు నటన వేపు చూపు సారిస్తున్నారు.

అలా వచ్చిన అమ్మాయే నిహారిక. మొదట టీవీ ప్రయోక్తగా ప్రేక్షకులకు పరిచయమైన ఆమె 2016లో వచ్చిన ‘ఒక మనసు’ సినిమాతో నాయికగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. దానికంటే ముందే ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ఒక తమిళ సినిమా చేసి, గత ఏడాది తెలుగులో ‘హ్యాపీ వెడ్డింగ్’లో నటించింది.

తెలుగులో చేసిన రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద సంతృప్తికర ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు తనతో రెండు వెబ్ సిరీస్ చేసిన ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్‌లో ‘సూర్యకాంతం’ సినిమా చేసింది నిహారిక. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమా మార్చి 29న విడుదలవుతోంది.

ట్రైలర్ చూస్తే ముక్కోణ ప్రేమకథతో ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పర్లీన్ భెసానియా మరో నాయికగా నటించింది. ఈ సినిమాతోనైనా నిహారిక హిట్ సాధించి సెలబ్రేట్ చేసుకుంటుందా? లెటజ్ వెయిట్ అండ్ సీ..

నిహారికకు హిట్ కావలెను!

నిహారికకు హిట్ కావలెను! | actioncutok.com

You may also like: