తాప్సీని ఆపేదెవ్వరు?


తాప్సీని ఆపేదెవ్వరు?

తెలుగు చిత్రసీమ ఆశించిన రీతిలో పట్టించుకోకపోయినా హిందీ చిత్రసీమ తాప్సీని అందలమెక్కిస్తూ వస్తోంది. నాయిక ప్రధాన చిత్రాలతో, విలక్షణ పాత్రలతో మెప్పిస్తూ దూసుకుపోతున్న ఆమె ఇటీవలే ‘బద్‌లా’ సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. నైనా సేథి పాత్రలో ఆమె నటనకు అటు ప్రేక్షకులు, ఇటి విమర్శకులు ఫిదా అయ్యారు.

తాజాగా ఆ సినిమా నిర్మాత సునీర్ ఖేతరపాల్ మరో నాయిక ప్రధాన చిత్రాన్ని తాప్సీతో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించేశారు. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్నాడు. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా షూటింగ్ సింగిల్ షెడ్యూల్లో నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో షూటింగ్ జరిపి, 2020 వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తారు.

తాప్సీ, కశ్యప్ కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. ఇదివరకు ఆ ఇద్దరూ 2018లో ‘మన్మర్జియాన్’ సినిమాకు కలిసి పనిచేశారు. అందులో తాప్సీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాలతో యమ బిజీగా ఉంది.

తాప్సీని ఆపేదెవ్వరు? | actioncutok.com

You may also like: