సెన్సార్ బోర్డుతో ‘దురదృష్టకర’ అపార్థాలు తొలిగాయన్న ఆర్జీవీ!


సెన్సార్ బోర్డుతో 'దురదృష్టకర' అపార్థాలు తొలిగాయన్న ఆర్జీవీ!

సెన్సార్ బోర్డుతో ‘దురదృష్టకర’ అపార్థాలు తొలిగాయన్న ఆర్జీవీ!

సెన్సార్ బోర్డ్‌తో జగడానికి సిద్ధమైన సుప్రసిద్ధ దర్శకుడు రాంగోపాల్ వర్మ మనసు మార్చుకున్నారు. తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూడకుండానే ఏప్రిల్ 11వ తేదీ వరకు దానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి కుదరదని సెన్సార్ బోర్డ్ తనకు లేఖ పంపినందున, బోర్డును కోర్టుకీడుస్తున్నానని చెప్పిన దర్శక శివుడు గంటల వ్యవధిలో మనసు మార్చుకున్నారు.

సోమవారం ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో తన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ పెడుతున్నాననీ, సెన్సార్ బోర్డుపై ఎందుకు కోర్టు కేసు పెట్టాల్సి వచ్చిందో వివరిస్తాననీ ప్రకటించిన రెండు గంటలకే ప్రెస్ మీట్‌ను కేన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు.

సెన్సార్ బోర్డుకూ, తన ఆఫీసుకూ మధ్య చోటు చేసుకున్న ‘దురదృష్టకరమైన’ అపార్థం తొలగిపోయిందని ట్విట్టర్ వేదికగా వర్మ తెలిపారు. “నిబంధనల ప్రకారం మా సినిమా విషయంలో తగిన చర్యలను సీబీఎఫ్‌సీ తీసుకుంటోంది. అందువల్ల సీబీఎఫ్‌సీకి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌ను కేన్సిల్ చేస్తున్నాం. జై ఎన్టీఆర్” అని ఆయన పోస్ట్ చేశారు.

ఆయన మాటల ప్రకారం సెన్సార్ బోర్డ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని పరిశీలించి, నిబంధనల మేరకు సర్టిఫికెట్‌ను జారీ చేసే అవకాశముంది. ఆ తర్వాతే సినిమా విడుదలను వర్మ ప్రకటించవచ్చు. యథాప్రకారం 22న సినిమ విడుదల ఉంటుందా, లేదా అనేది కూడా ఇంకా వెల్లడి కాలేదు.

సెన్సార్ బోర్డుతో ‘దురదృష్టకర’ అపార్థాలు తొలిగాయన్న ఆర్జీవీ! | actioncutok.com

You may also like:

One thought on “సెన్సార్ బోర్డుతో ‘దురదృష్టకర’ అపార్థాలు తొలిగాయన్న ఆర్జీవీ!

Comments are closed.