కాంగ్రెస్ అభ్యర్థిగా ‘రంగీలా’ గాళ్!

కాంగ్రెస్ అభ్యర్థిగా ‘రంగీలా’ గాళ్!
రాంగోపాల్ వర్మ సినిమా ‘రంగీలా’తో స్టార్ హీరోయిన్గా ఎదిగి, కుర్రకారును ఒక ఊపి ఊపి, అనేక చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఊర్మిళ మతోంద్కర్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమెను ముంబై ఉత్తరం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఊర్మిళకు లోక్‌సభ టికెట్ ఇవ్వాల్సిందిగా పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు గురువారమే ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు మిళింద్ దేవర చెప్పారు. అంతకు ముందు రోజే రాహుల్ గాంధీ సమక్షంలో 45 ఏళ్ల ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు రోజులకే ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ కేటాయించింది. ప్రస్తుతం ముంబై నార్త్ సీటుకు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏప్రిల్ 29న ఆ నియోజక వర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోకుల్‌నాథ్ శెట్టిని ఊర్మిళ ఢీకొనబోతున్నారు. “క్రియాశీలక రాజకీయాల్లో ఇది నా తొలి అడుగు. మహత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ సిద్ధాంతాల ఆధారంగా నా రాజకీయ దృక్పథాన్ని తీర్చిద్దిన కుటుంబం నుంచి వచ్చాను. నేను సినీ నటిని అయినప్పటికీ చిన్నతనం నుంచే నాలో సామాజిక చైతన్యం ఉంది” అని చెప్పారు ఊర్మిళ.
కాంగ్రెస్ అభ్యర్థిగా ‘రంగీలా’ గాళ్! | actioncutok.com
You may also like: