తెలుగులో క్యూ కడుతున్న హీరోయిన్ సినిమాలు!


తెలుగులో క్యూ కడుతున్న హీరోయిన్ సినిమాలు!

తెలుగులో క్యూ కడుతున్న హీరోయిన్ సినిమాలు! – actioncutok.com

అన్ని రంగాల మాదిరిగానే సినీ రంగం కూడా పురుషాధిక్య రంగమే. హీరో చుట్టూనే సినిమా కథ తిరుగుతుంది. హీరోయిన్ అడపాదడపా కనిపిస్తూ ఆ హీరో చుట్టూ తిరుగుతుంటుంది. అయితే కొంత కాలంగా తెలుగు సినిమాల్లో స్త్రీ ప్రధాన కథలతో సినిమాలు రూపొందుతూ వస్తున్నాయి. కొన్ని సినిమాలు పెద్ద హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నాయి కూడా.

గత ఏడాది అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా రూ. 30 కోట్ల షేర్‌ను వసూలు చేసి, సూపర్ హీరోయిన్‌గా ఆమెకున్న ఇమేజ్‌ను స్పష్టం చేసింది.  

తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి విజయశాంతి తొలి సూపర్ హీరోయిన్‌గా చరిత్రకెక్కగా, ఆమె బాటలో అనుష్క సైతం అదే పేరును సొంతం చేసుకుంది. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ చిత్రాలు అందుకు నిదర్శనం. అలాగే ‘మహానటి’తో కీర్తిసురేశ్ కూడా ఆ లీగ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమా రూ. 40 కోట్ల మార్కును దాటింది.

మరికొంతమంది తారలు సైతం స్త్రీ ప్రధాన సినిమాల్లో నటిస్తూ తమ ఉనికిని చాటుతున్నారు. ఈ ఏడాది పలు స్త్రీ ప్రధాన చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం.

మొదట ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాతో ఈనెల 15న తమన్నా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత అనసూయ నటిస్తున్న ‘కథనం’, నందితా శ్వేత ‘అక్షర’, అంజలి ‘గీతాంజలి 2’, సమంత ‘ఓ బేబీ.. ఎంత సక్కగున్నావే’, కీర్తి సురేశ్ నటిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సినిమా.. ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా విడుదల కానున్నాయి.

తెలుగులో క్యూ కడుతున్న హీరోయిన్ సినిమాలు! – actioncutok.com

You may also like: