’96’ రీమేక్ షూటింగ్ షురూ!


'96' రీమేక్ షూటింగ్ షురూ!

’96’ రీమేక్ షూటింగ్ షురూ!

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించగా ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసల్ని అమితంగా పొందిన ’96’ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ ఉగాది రోజు లాంఛనంగా మొదలైంది. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేంకుమార్ రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ వేడుకలో ‘దువ్వాడ జగన్నాథం’ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా పాల్గొన్నారు.

నిర్మాత రాజు మాట్లాడుతూ “మా బేనర్‌లో ఎన్నో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ రూపొందాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అదే కోవలో ఇప్పుడు ఈ లవ్ స్టోరీని అందించబోతున్నాం. ఈ నెల ద్వితీయార్థం నుంచి ’96’ రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మొదట 15 రోజుల పాటు కెన్యాలో కీలక సన్నివేశాల్ని తీస్తాం. తర్వాత హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. జూలైకి షూటింగ్ పూర్తవుతుంది” అని చెప్పారు.

ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, రచన: మిర్చి కిరణ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సంగీతం: గోవింద్ వసంత, కెమెరా: జె.మహేంద్రన్.

'96' రీమేక్ షూటింగ్ షురూ!

’96’ రీమేక్ షూటింగ్ షురూ! | actioncutok.com

You may also like: