ఏడాది తర్వాత సెట్స్‌పైకి అల్లు అర్జున్


ఏడాది తర్వాత సెట్స్‌పైకి అల్లు అర్జున్

ఏడాది తర్వాత సెట్స్‌పైకి అల్లు అర్జున్

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం (ఏప్రిల్ 24) హైదరాబాద్‌లో మొదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సరిగ్గా ఏడాది తర్వాత అర్జున్ సినిమా సెట్స్ పైకి రావడం గమనార్హం. ఆయన మునుపటి సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ షూటింగ్ 2018 ఏప్రిల్‌లోనే పూర్తయింది.

హీరోగా అర్జున్‌కు ఇది 19 వ చిత్రం కాగా, త్రివిక్రంతో మూడో చిత్రం. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు వచ్చాయి. కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత ఆ ఇద్దరూ జంటగా నటిస్తోన్న చిత్రమిదే. ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

అర్జున్ తల్లిగా టబు కీలక పాత్ర చేస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేశ్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులు. హీరో సుశాంత్ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: తమన్ ఎస్., ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాశ్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్.

ఏడాది తర్వాత సెట్స్‌పైకి అల్లు అర్జున్ | actioncutok.com

You may also like:

2 thoughts on “ఏడాది తర్వాత సెట్స్‌పైకి అల్లు అర్జున్

Comments are closed.