ఏపీలో దాడులకు సిద్ధమవుతున్న ఏసీబీ!


ఏపీలో దాడులకు సిద్ధమవుతున్న ఏసీబీ!

ఏపీలో దాడులకు సిద్ధమవుతున్న ఏసీబీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతో హిమాచల్ ప్రదేశ్‌లో సేదతీరుతుండగా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరు రోజుల విశ్రాంతి తీసుకొని వచ్చిన సమయంలో, విజయవాడలోని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) గత మూడు రోజుల నుంచీ తన కార్యకలాపాల్ని వేగవంతం చేసింది.

ఇంటలిజెన్స్ చీఫ్ పదవి నుంచి ఏసీబీ చీఫ్‌గా ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన ఎ.బి. వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వోద్యోగులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తన పరిధి కిందకు వస్తారని స్పష్టం చేయడంతో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే మే 23 లోగా ఏసీబీ ఏదో పెద్ద చర్య చేపట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

వైసీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకే వెంకటేశ్వరరావు బదిలీ జరగడం గమనార్హం. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు, కొద్దిమంది బ్యూరోక్రాట్లు, ఆదాయపన్ను శాఖ ఉద్యోగులు లక్ష్యంగా ఏసీబీ దాడులు ఉండవచ్చునని ఊహిస్తున్నారు.

ఏపీలో దాడులకు సిద్ధమవుతున్న ఏసీబీ! actioncutok.com

Trending now: