అమల అక్కినేని ‘హై ప్రీస్టెస్’ ప్ర‌సారం ప్రారంభం


అమల అక్కినేని హై ప్రిస్ట్స్ ప్ర‌సారం ప్రారంభం

అమల అక్కినేని హై ప్రిస్ట్స్ ప్ర‌సారం ప్రారంభం

అక్కినేని వారి కోడలు ప్రముఖ నటి అమల అక్కినేని చాలా రోజుల తరువాత మరో సారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. జీ 5 ఆప్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘హై ప్రీస్టెస్’ లో అమల ముఖ్య పాత్ర పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జీ 5 ఆప్ లో ఆన్లైన్ అవుతుంది.

టారో రీడింగ్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని పుష్ప డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో అమలతో పాటు ప్రముఖు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మి శరత్ కుమార్, సునైనా, బిగ్ బాస్ 2 ఫేమ్ నందిత తదితరులు నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఈ వెబ్ సిరీస్ కి వర్క్ చేసారు.

గతంలో ఎన్నో విజయవంతమైన వెబ్ సిరీస్లను అందించిన నేపథ్యంలో మరోసారి మరింతగా ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయతనంలో అక్కినేని అమలతో ఈ ‘హై ప్రీస్టెస్’ అనే సిరీస్ ని నిర్మించామని జీ 5 ఆప్ బృందం తెలిపింది.

అమల మాట్లాడుతూ
“కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే, తెరఫై తక్కువుగా కనిపిస్తున్నాను. చాల రోజులు తరువాత ఇది రావడం, డైరెక్టర్ పుష్ప చెప్పిన లైన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఒప్పుకున్నాను. నాకు బాగా ఆసక్తిగా అనిపించే టారో రీడింగ్ నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ కథ ఉండటంతో అది నాకు బాగా నచ్చింది, ప్రేక్షకులకి కూడా నచ్చుతుంది. ఏప్రిల్ 25న జీ 5 ఆప్ లో హై ప్రిస్ట్స్ వెబ్ సిరీస్ ఆన్లైన్ లో ప్ర‌సారం అవుతుంది. అక్కినేని ఫాన్స్ తో పాటు, మిగిలిన అభిమానులని కూడా ఈ వెబ్ సిరీస్ తప్పక ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు.

అమల అక్కినేని హై ప్రిస్ట్స్ ప్ర‌సారం ప్రారంభం | actioncutok.com

You may also like: