ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: దేవినేని అవినాశ్ జోరును కొడాలి నాని అడ్డుకుంటారా?


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: దేవినేని అవినాశ్ జోరును కొడాలి నాని అడ్డుకుంటారా?
Kodali Nani and Devineni Avinash

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: దేవినేని అవినాశ్ జోరును కొడాలి నాని అడ్డుకుంటారా?

కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్వస్థలమైన గుడివాడ నియోజకవర్గంలో ఈసారి ఫలితం ఎలా ఉంటుందోననే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభర్థి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)తో టీడీపీ అభ్యర్థిగా దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాశ్ తలపడుతున్నారు.

గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన కొడాలి నాని తన పరం చేసుకొని చంద్రబాబును ఉలిక్కిపడేలా చేశారు. మరోసారి ఆయనకే గుడివాడ టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నానికి ఇప్పుడు దేవినేని అవినాశ్ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురవుతున్నారు.

ఒకవైపు దేవినేని నెహ్రూ కుమారుడిగా ప్రజల్లో ఆదరాభిమానాలు పొందుతున్న అవినాశ్‌కు కొత్తగా యూత్‌లో క్రేజ్ పెరిగిందని పరిశీలకులు చెప్తున్నారు. అవినాశ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు కావడం కూడా యువతకు ఆయనను సన్నిహితం చేసిందనేది వాళ్ల మాట.

గతంలో గుడివాడలోని టీడీపీ కార్యకర్తల్ని నాని తనతో తీసుకుపోవడం వల్ల ఆ పార్టీ అప్పుడు డీలా పడింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీ క్యాడర్ పటిష్ఠపడింది. ఇది అవినాశ్ విజయానికి దోహదం చేసే అంశాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. గుడివాడలో ఎస్సీ ఓటర్లు ఎక్కువ. వాళ్లు ఎవర్ని ఆదరిస్తే వాళ్లే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

అందుకని ఇటు నాని, అటు అవినాశ్ ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. జనసేన వల్ల కాపు ఓటర్లు చీలిపోయే అవకాశం ఉండేది. కానీ ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం వల్ల పోటీ నాని వర్సెస్ అవినాశ్ అన్నట్లుగానే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాత్రేయులు కానీ, బీజేపీ అభ్యర్థి గుత్తికొండ రాజాబాబు కానీ డిపాజిట్ తెచ్చుకొనే అవకాశం కనిపించడం లేదు.

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లలో గుడివాడ ఒకటిగా చెప్పుకుంటున్నారు. మని అవినాశ్ క్రేజ్‌ను దాటి నాని గెలుపు సాధిస్తారా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: దేవినేని అవినాశ్ జోరును కొడాలి నాని అడ్డుకుంటారా? | actioncutok.com

You may also like: