ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లక్షపై కన్నేసిన జగన్!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లక్షపై కన్నేసిన జగన్!
YS Jagan

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లక్షపై కన్నేసిన జగన్!

కడప జిల్లా అంటే గుర్తుకొచ్చేది పులివెందుల. పులివెందుల అంటే గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీని నెలకొల్పిన వైఎస్ జగన్మోహనరెడ్డి 2014 ఎన్నికల్లో కచ్చితంగా తన పార్టీని అధికారంలోకి తీసుకు రాగలనని భావించారు. కానీ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

అయినప్పటికీ పులివెందుల నియోజక వర్గంలో 75 వేలకు మించిన మెజారిటీతో జగన్ ఘన విజయం సాధించారు. ఆయనకు లక్షా 24 వేలకు పైగా ఓట్లు లభించగా, టీడీపీ ప్రత్యర్థి వెంకట సతీశ్‌రెడ్డి 49 వేలకు పైగా ఓట్లు లభించాయి.

ఇప్పుడు మళ్లీ జగన్మోహనరెడ్డిపై అదే సతీశ్‌రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటి దాకా ఆయన నాలుగు సార్లు వైఎస్ కుటుంబీకులతో పోటీపడి ఓడిపోయారు. ఇప్పుడు ఐదోసారి పోటీలో నిలిచారు. జగన్‌కు ఈసారైనా గట్టి పోటీనివ్వాలని సతీశ్‌రెడ్డి కసిగా ఉన్నారు. పులివెందులకు కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత తమదేనని టీడీపీ చెప్పుకుంటోంది. ఇది తమకు ఓట్లను పెంచుతుందని ఆశిస్తోంది.

అయితే ఈసారి మెజారిటీని మరింత పెంచుకోవాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. లక్ష ఓట్ల మెజారిటీపై ఆయన కన్నేశారు. అది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు సైతం అంచనా వేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ విజయ బావుటా ఎగురవేసి, ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి తగిన మెజారిటీ సాధిస్తుందని అనేక సర్వేలు చెప్తుండటం జగన్‌కు కలిసి రానున్నది. పులివెందులకు తాను రారాజునని నిరూపించేందుకు ఆయన మరోసారి సిద్ధమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లక్షపై కన్నేసిన జగన్! | actioncutok.com

You may also like:

2 thoughts on “ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లక్షపై కన్నేసిన జగన్!

Comments are closed.