ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం: నిఖిల్


ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం: నిఖిల్

ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం: నిఖిల్

నిఖిల్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని మే 1న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. కానీ అనూహ్యంగా నిర్మాతలు విడుదల వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

సినిమా విడుదలని వాయిదా వేయడానికి గల కారణాలని నిఖిల్ సోషల్ మీడియాలో వివరించాడు. ‘ఒక సంవత్సరం గ్యాప్, మంచి సినిమాతో మీముందుకు రావాలనుకున్నాను. ఏడాది కాలంగా మా చిత్ర యూనిట్ అర్జున్ సురవరం చిత్రం కోసం కష్టపడ్డాం. కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేసి మీ అభిమానాన్ని పొందాలనుకున్నాం. విడుదల కోసం ఎదురుచూస్తున్న సమయంలో అవెంజర్స్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎలా అయితే అవెంజర్స్ థానోస్ ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడుతారో, అర్జున్ సురవరం కూడా స్టూడెంట్స్ కోసం పోరాడతాడని’ నిఖిల్ తెలిపాడు.

ఏప్రిల్ 26న అవెంజర్స్:ఎండ్ గేమ్ విడుదల కానుండడంతో ఈ సమయంలో సినిమాని విడుదల చేయడం మంచిది కాదని డిస్ట్రిబ్యూటర్లు సూచించారు. సినిమాని డబ్బు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవించి సినిమాని వాయిదా వేస్తున్నట్లు నిఖిల్ ప్రకటించాడు.

‘ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం, ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నాను. మరో గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నా’ అని నిఖిల్ తెలిపాడు.

ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం: నిఖిల్

You may also like:

One thought on “ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం: నిఖిల్

Comments are closed.