‘అవెంజర్స్’తో ‘జెర్సీ’కి గట్టి దెబ్బ!


'అవెంజర్స్'తో 'జెర్సీ'కి గట్టి దెబ్బ!

‘అవెంజర్స్’తో ‘జెర్సీ’కి గట్టి దెబ్బ!

ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో హాలీవుడ్ ఫిల్మ్ ‘అవెంజెర్స్: ఎండ్ గేమ్’ విడుదలవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు వెర్షన్నూ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 900 మిలియన్ డాలర్లను ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ సినిమా చరిత్రలో ఈ ఫీట్ మరే సినిమా ఇంతవరకూ సాధించలేదు.

‘అవెంజెర్స్’ సిరీస్‌లోని మునుపటి సినిమా ‘అవెంజెర్స్: ఇన్ఫినిటీ వార్’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 640.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. మొత్తంగా దాని వసూళ్లు 2 బిలియన్ డాలర్లను మించాయి. ఆ రికార్డును ‘ఎండ్ గేమ్’ అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులు వాళ్లూ ఈ సినిమా కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అందుకే గతంలో ఏ సినిమాకీ కనిపించనంత క్రేజ్ ఈ సినిమాకి కనిపిస్తోంది. కారణం.. ‘ అవెంజెర్స్’ సిరీస్‌లో ఇది చివరి సినిమా కావడం. ప్రపంచాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకొనే మహా భయకర విలన్ థానోస్‌ను అవెంజర్స్ అంతా కలిసి ఎలా తుదముట్టించారో కనులారా వీక్షించేందుకు అందరూ ఊపిరిబిగపట్టుకొని ఉన్నారు.

తెలుగు సినిమాకి ఇటీవల యు.ఎస్. మార్కెట్ బాగా పెరిగింది. సినిమా ఏ మాత్రం బాగా ఉందని టాక్ వచ్చినా మిలియన్ డాలర్లను సునాయాసంగా వసూలు చేస్తోంది. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ విడుదలయ్యే సమయంలో తమ సినిమాని విడుదల చేస్తే, అటు యు.ఎస్.లోనే కాకుండా ఇటు సొంత ప్రాంతాల్లోనూ వసూళ్లను నష్టపోతామని భావించబట్టే ‘మహర్షి’, ‘సీత’ సినిమాల విడుదలని పోస్ట్‌పోన్ చేశారు.

ప్రస్తుతం ఆడుతున్న ‘జెర్సీ’, ‘కాంచన 3’ సినిమాలకు ఏప్రిల్ 25 వరకే చెప్పుకోదగ్గ వసూళ్లు ఉంటాయి. ఆ తర్వాత నుంచి ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ హవా ముందు తలవంచక తప్పదు. ‘కాంచన’కు ఫర్వాలేదు కానీ, ‘జెర్సీ’కి తెలుగు రాష్ట్రాల్లో గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యు.ఎస్,లో ఇప్పటికే 80 శాతం పైగా వసూలైంది కాబట్టి అక్కడ ఫర్వాలేదు.

'అవెంజర్స్'తో 'జెర్సీ'కి గట్టి దెబ్బ!

‘అవెంజర్స్’తో ‘జెర్సీ’కి గట్టి దెబ్బ! | actioncutok.com

You may also like: