నరసాపురంలో నాగబాబు.. అంతే సంగతులు!

నరసాపురంలో నాగబాబు.. అంతే సంగతులు!
Nagababu

నరసాపురంలో నాగబాబు.. అంతే సంగతులు!

ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం లోక్‌సభ నియోజక వర్గంలో ఈసారి ఏ పార్టీ జయకేతనం ఎగురవేస్తుంది? జనసేన మాత్రం కాదని ఎన్నికల విశ్లేషకులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఇక్కడ జనసేన తరపున దాని అధినేత పవన్ కల్యాణ్ రెండో అన్న నాగబాబు పోటీ చేశారు. ఆయన గెలవడం అత్యాశే అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉందని చెప్పుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి కె. రఘురామ కృష్ణంరాజు విజేతగా నిలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయనకు టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు గట్టి పోటీనిచ్చారు. ఆ ఇద్దరిలోనే ఒకరు జెండా ఎగరేసే అవకాశాలున్నాయని అంచనా.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పోటీ చేశారు. నాగబాబు కంటే బాపిరాజుకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచి ఒక నటుడు పార్లమెంటుకు వెళ్లారు. ఆయన.. రెబల్ స్టార్ కృష్ణంరాజు.

1999లో బీజీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు కృష్ణంరాజు. నాగబాబు గెలిస్తే నరసాపురం నుంచి పార్లమెంటుకు వెళ్లే రెండో సినీ నటుడు అవుతారు. కానీ అలా ఆశించే పరిస్థితి కనిపించడం లేదు. ఏదేమైనా నాగబాబు ఇక్కడ మూడు, లేదా నాలుగో స్థానానికే పోటీ పడుతున్నారని చెప్పుకుంటున్నారు.

నరసాపురంలో నాగబాబు.. అంతే సంగతులు! actioncutok.com

You may also like: