ఆయన చెంప చెళ్లుమనిపించాలని గుర్తు పెట్టుకుంటా: చిన్మయి

ఆయన చెంప చెళ్లుమనిపించాలని గుర్తు పెట్టుకుంటా: చిన్మయి
ఎన్నికల ప్రచార సందర్భంలో తనను అసభ్యంగా తాకిన ఒక యువకుడి చెంప చెళ్లుమనిపించి ఇటీవల వార్తల్లో నిలిచారు రాజకీయ నాయకురాలిగా మారిన నటి ఖుష్బూ. ఆమె ధైర్యంగా వ్యవహరించారనీ, స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించేవారికి సరైన సమాధానమిచ్చారనీ ఎక్కువమంది ప్రశంసించారు. ఆ ఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ఆ క్లిప్‌ను ఒక నెటిజన్ ట్విట్టర్లో గాయని చిన్మయికి షేర్ చేసి, అలాంటి లైంగిక వేధింపులకు ఖుష్బూ మాదిరిగా తక్షణమే స్పందించాలని పేర్కొన్నాడు. దానికి చిన్మయి స్పందించారు.
“కచ్చితంగా. ఈసారి కనిపిస్తే మిస్టర్ వైరముత్తు చెంప చెళ్లుమనిపించాలనే విషయం గుర్తు చేసుకుంటా. చూస్తుంటే అలా అయితేనే నాకు న్యాయం జరిగేలా ఉంది. ఇప్పుడు నాకా వయసు వచ్చింది. ధైర్యమూ ఉంది” అని ట్వీట్ చేశారు.
అదివరకు దేశంలో ‘మి టూ’ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంగా.. తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించారని చిన్మయి తీవ్ర ఆరోపణలు చేశారు. వైరముత్తు తమతో కూడా అసభ్యంగా ప్రవర్తించారనే కొంతమంది మహిళల వ్యాఖ్యలనూ ఆమె షేర్ చేశారు.
దాంతో వైరముత్తు అభిమానుల నుంచి ఆమె తీవ్ర స్థాయిలో నిరసనలనూ, బెదిరింపులనూ ఎదుర్కొన్నారు. ఘటన జరిగినప్పుడే ఆయనపై ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదనీ, ఇన్నేళ్ల తర్వాత ఆ విషయం ఎందుకు చెబ్తున్నారంటూ విమర్శించారు.
ఆయన చెంప చెళ్లుమనిపించాలని గుర్తు పెట్టుకుంటా: చిన్మయి | actioncutok.com
You may also like: