ఖరారు: మే 1న వస్తోన్న ‘అభినేత్రి 2’


ఖరారు: మే 1న వస్తోన్న 'అభినేత్రి 2'

ఖరారు: మే 1న వస్తోన్న ‘అభినేత్రి 2’

ప్రభుదేవా, తమన్నా జంటగా విజయ్‌ దర్శకత్వంలో 2016లో రూపొందిన చిత్రం ‘అభినేత్రి’. దానికి సీక్వెల్‌గా విజయ్ దర్శకత్వంలోనే ‘అభినేత్రి 2’ చిత్రం రూపొందుతోంది. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాతో పాటు నందితాశ్వేత, డింపుల్‌ హయాతి, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు.

నిర్మాతలు మాట్లాడుతూ ”అభినేత్రి తెలుగులో ‘దేవి’ పేరుతో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. హారర్‌ కామెడీ జోనర్‌లో రూపొందిన సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌, సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, డైలాగ్స్‌: సత్య, ఎడిటింగ్‌: అంటోని.

ఖరారు: మే 1న వస్తోన్న ‘అభినేత్రి 2’ | actioncutok.com

You may also like:

One thought on “ఖరారు: మే 1న వస్తోన్న ‘అభినేత్రి 2’

Comments are closed.