‘దబాంగ్ 3’ కష్టాలు కొనసాగుతున్నాయి!


'దబాంగ్ 3' కష్టాలు కొనసాగుతున్నాయి!

‘దబాంగ్ 3’ కష్టాలు కొనసాగుతున్నాయి!

సల్మాన్ ఖాన్ సినిమా ‘దబాంగ్ 3’కి ఒక దాని తర్వాత ఒకటిగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. మొదట చెక్క పలకలు కప్పిన శివలింగం ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో గగ్గోలు లేచింది. ఆ సినిమా సెట్స్ నుంచి తొలగించే సమయంలో ఒక రాతి విగ్రహం దెబ్బతినడం ప్రజల ఆగ్రహానికి కారణమింది.

దాని తర్వాత, భారత పురావస్తు అధ్యయన శాఖ (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా – ఏఎస్ఐ) నుంచి పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. జైపూర్ సిటీలోని జల్ మహల్ లోపల నిర్మించిన రెండు కట్టడాల్ని తొలగించాల్సిందిగా నిర్మాతలకు ఏఎస్ఐ నోటీసు పంపింది.

వాటిని కట్టడం ద్వారా ఆ సినిమా నిర్మాతలు ఏన్షియంట్ మోనుమెంట్ అండ్ ఆర్కియోలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958ను ఉల్లంఘించారనేది ఆ నోటీసు సారాంశం. నిబంధనలను పాటించని పక్షంలో షూటింగ్‌ను నిలిపేస్తామని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు.

దాంతో జల్ మహల్‌లో సెట్ కింద నిర్మించిన రెండు కట్టడాల్ని చిత్ర బృందం తొలగించక తప్పలేదు. అక్కడికి సమీపంలోని ముంజ్ కొలను వద్ద బుధవారం షూటింగ్ నిర్వహించారు. పోలీసు దుస్తుల్లో ఉన్న సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్ రౌడీలతో ఫైట్ చేసే సన్నివేశాల్ని చిత్రీకరించారు.

సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తోన్న ‘దబాంగ్ 3’ని ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్నాడు. 2009లో వచ్చిన ‘వాంటెడ్’ (‘పోకిరి’ రీమేక్) తర్వాత సల్మాన్, ప్రభుదేవా కలయికలో తయారవుతున్న సినిమా ఇదే.

‘దబాంగ్ 3’ కష్టాలు కొనసాగుతున్నాయి! | actioncutok.com

You may also like: