పేరు మార్చుకున్న మెగా హీరో.. లక్కు చిక్కినట్లేనా!


పేరు మార్చుకున్న మెగా హీరో.. లక్కు చిక్కినట్లేనా!
Sai Tej

పేరు మార్చుకున్న మెగా హీరో.. లక్కు చిక్కినట్లేనా!

సినీ రంగంలో ముహూర్తాలు, వారాలు, వ‌ర్జ్యాలకు ప్రాముఖ్య‌తనిస్తుంటారు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. ల‌క్కు చిక్క‌ని వారు అదృష్టం వ‌రించాల‌ని పేర్లు మార్చుకుని సూప‌ర్‌స్టార్‌లుగా ఎదిగిన ఉదంతాలూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే సంప్ర‌దాయాన్ని మెగా హీరో కూడా కొన‌సాగించ‌బోతున్నాడు.

మెగా మేన‌ల్లుడిగా ‘రేయ్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన సాయిధ‌ర‌మ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల్ని ద‌క్కించుకోలేక‌పోయాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుప్రీమ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్ని మిన‌హాయిస్తే అత‌ని కెరీర్‌లో విజయాలు శూన్యం.

దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ సాయిధ‌ర‌మ్‌ తేజ్ త‌న అదృష్టాన్ని మార్చుకోవ‌డం కోసం ఇద్ద‌రు మామ‌ల‌ని ఫాలోఅయ్యాడు. సాయిధ‌ర‌మ్‌ తేజ్ కాస్తా హిట్ కోసం సాయితేజ్‌గా మారి చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అత‌నికి భారీ విజ‌యాన్ని అందించింది అని చెప్ప‌లేం కానీ గ‌త చిత్రాల‌తో పోలిస్తే మంచి స‌క్సెస్‌నే అందించింది.

దీంతో ఇక నుంచి త‌న‌కు హిట్‌ని అందించిన అదే పేరుని కంటిన్యూ చేయ‌బోతున్నాడు. అలా చేస్తే పేరు తెచ్చిన అదృష్టం కూడా కంటిన్యూ అవుతుంద‌ని అత‌ని ఆశ‌. సో.. సాయిధ‌ర‌మ్‌ తేజ్ ఇక‌పై సాయితేజ్‌గా వ‌రుస విజ‌యాల్ని అందుకుంటాడేమో చూద్దాం.

పేరు మార్చుకున్న మెగా హీరో.. లక్కు చిక్కినట్లేనా! | actioncutok.com

You may also like: