మోది బయోపిక్ విడుదలను ఆపేసిన ఎన్నికల కమిషన్!


మోది బయోపిక్ విడుదలను ఆపేసిన ఎన్నికల కమిషన్!

మోది బయోపిక్ విడుదలను ఆపేసిన ఎన్నికల కమిషన్!

వివేక్ ఓబరాయ్ టైటిల్ రోల్ చేసిన ప్రధాని నరేంద్ర మోది బయోపిక్ విడుదలను బుధవారం ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ‘పిఎం నరేంద్ర మోది’ని ఏప్రిల్ 11న విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. అదే రోజు లోక్ సభ ఎన్నికల మొదటి దశ ప్రారంభమవుతోంది.

ఎన్నికల వేళ ఆ సినిమా విడుదలకు అంగీకరిస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ ఒక కాంగ్రెస్ కార్యకర్త వేసిన పిటిషన్‌ను మంగళవారం కొట్టివేసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్ అని పేర్కొంది.

అందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ నియమించిన పోల్ ప్యానెల్ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆ సినిమా విడుదలను ఆపాలంటూ నిర్ణయించింది. “ఏ రాజకీయ ప్రయోజనాన్ని కానీ, లేదా రాజకీయ వ్యక్తిని కానీ ఉద్దేశించి తీసిన బయోపిక్‌ను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు” అని కూడా అది వ్యాఖ్యానించింది.

ఆ ప్రకారం చూసుకుంటే ఇటీవలే వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ సినిమా స్టార్ మా చానల్‌లో ప్రసారం చేయడం తప్పే అవుతుంది.

మోది బయోపిక్ విడుదలను ఆపేసిన ఎన్నికల కమిషన్! | actioncutok.com

You may also like: