‘గబ్బర్‌సింగ్’ రాజశేఖర్‌కు యాక్సిడెంట్!

‘గబ్బర్‌సింగ్’ రాజశేఖర్‌కు యాక్సిడెంట్!
‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచిన ఎపిసోడ్ ‘అంత్యాక్షరి’. పవన్ కల్యాణ్‌తో పాటు రౌడీ బ్యాచ్ పాల్గొనగా చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా నిలిచి సినిమా విజయంలో ఓ భూమికను పోషించిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్లో హీరో రాజశేఖర్‌ను అనుకరిస్తూ ఆంజనేయులు అనే జూనియర్ ఆర్టిస్ట్ పాడిన “రోజ్ రోజ్ రోజా పువ్వా” పాట ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచేసింది.
ఈ ఎపిసోడ్‌తో అతనికి మంచి పేరొచ్చింది. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించి గబ్బర్‌సింగ్ బ్యాచ్‌గా గుర్తింపు పొందిన ఈ నటుల్లో ఆంజనేయులు శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన భార్యతో కలిసి గచ్చిబౌలి వెళుతూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు.
గత కొంత కాలంగా హైదరాబాద్ కృష్ణానగర్ సమీపంలోని ఇందిరానగర్‌లో నివాసం వుంటున్న ఆంజనేయులు ఓ పని నిమిత్తం బైక్‌పై గచ్చిబౌలి వెళుతుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని భార్య స్వల్ప గాయాలతో బయటపడగా, ఆంజనేయులు ఎడమచేతికి, ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు భార్యాభర్తల్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఆంజనేయులు తమకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యాక్సిడెంట్ చేసిన కారుని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
‘గబ్బర్‌సింగ్’ రాజశేఖర్‌కు యాక్సిడెంట్! | actioncutok.com
You may also like: