కేటీఆర్ వల్లే గ్లోబరీనాకు ఇంటర్ ఫలితాల కాంట్రాక్ట్?


కేటీఆర్ వల్లే గ్లోబరీనాకు ఇంటర్ ఫలితాల కాంట్రాక్ట్?

కేటీఆర్ వల్లే గ్లోబరీనాకు ఇంటర్ ఫలితాల కాంట్రాక్ట్?

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 18న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థులతో పాటు, తల్లిదండ్రుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఫలితాలకు, ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సంబంధం లేకుండా వుండటంతో ఒక్కసారిగా ఇంటర్బోర్డ్ చుట్టూ వివాదం మొదలైంది.

విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష నేతలు ఇంటర్ బోర్డు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో ఇది మరింత వివాదంగా మారింది. ఇంటర్ బోర్డులో అవకతవకలపై స్వయంగా విద్యాశాఖ మంత్రి కమిటీ వేసినా రచ్చ ఆగడం లేదు. దీనిక కారణం ఇంటర్ ఫలితాల్ని పర్యవేక్షించిన గ్లోబరీనా సంస్థే అని, వారి అత్యుత్సాహం కారణంగానే ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని సర్వత్రా చర్చజరుగుతోంది.

గతంలో ఇంటర్ ఫలితాల్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ పర్యవేక్షించేది. అయితే ఇటీవల ఆ సంస్థని పక్కన పెట్టి ఆ బాధ్యతల్ని వివాదాస్పద సంస్థగా నేరున్న గ్లోబరీనాకు అప్పగించారు. ఈ తంతు వెనక తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వున్నారని, ఆయన కారణంగానే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను కాదని గ్లోబరీనా సంస్థకు ఆ బాధ్యతల్ని కట్టబెట్టారని తాజాగా వినిపిస్తోంది.

దీనిపై గ్లోబరీనా సంస్థ సీఈఓ వీఎస్ఎన్ రాజు స్వయంగా స్పందించడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. మాగ్నటిక్ సంస్థతో పోటీపడి మరీ ఈ ప్రాజెక్ట్ను అత్యంత తక్కువ బిడ్డింగ్తో దక్కించుకన్నామని, ఇంటర్ ఫలితాల ప్రాజెక్ట్ తమకు దక్కడం వెనుక ఏ రాజకీయ నేత ప్రోద్బలం లేదని, తమపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేయడం అనుమానాలకు తావిస్తోంది.

కేటీఆర్ వల్లే గ్లోబరీనాకు ఇంటర్ ఫలితాల కాంట్రాక్ట్? | actioncutok.com

You may also like: