‘చిత్రలహరి’.. దక్కిందే సంతోషం!


'చిత్రలహరి'.. దక్కిందే సంతోషం!

‘చిత్రలహరి’.. దక్కిందే సంతోషం!

‘చిత్రలహరి’ సినిమాతో సాయిధరం తేజ్ అలియాస్ సాయి తేజ్ (ఈ సినిమాతో తెర పేరు మార్చుకున్నాడు) ఊపిరి పీల్చుకున్నాడని చాలామంది అంటున్నారు. వరుస ఆరు ఫ్లాపులకు ఎట్టకేలకు ‘చిత్రలహరి’తో అడ్డుకట్ట పడిందని చెప్పుకుంటున్నారు. నిజానికి ‘చిత్రలహరి’ అంత హిట్టయిందా?

వినాయక్ డైరెక్ట్ చెయ్యగా గత ఏడాది వచ్చిన ‘ఇంటిలిజెంట్’ సినిమా రూ. 27 కోట్లకు అమ్ముడుపోయింది. అందులో నాలుగో వంతు కూడా అది వసూలు చేయకపోవడం వేరే సంగతి. మరిప్పుడు ‘చిత్రలహరి’ ఏమైనా రూ. 30 కోట్లు వసూలు చేసిందా? లేదు. రూ. 25 కోట్లు వసూలు చేసిందా? లేదు.

తక్కువలో తక్కువ రూ. 20 కోట్లు వసూలు చేసిందా? అది కూడా లేదు. పోనీ కనీసం రూ. 15 కోట్లయినా వసూలు చేసిందా? అబ్బే.. అంత కూడా వసూలు చెయ్యలేదు. మరైతే ‘చిత్రలహరి’ హిట్టయ్యిందని ఎందుకు సాయితేజ్ సంతోషపడుతున్నాడు?

ఎందుకంటే ఆ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విలువ వరల్డ్ వైడ్‌గా రూ. 12.8 కోట్లని అంచనా. వచ్చిన వసూళ్లు దానికి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అంటే కష్టమ్మీద సేఫ్‌జోన్‌లోకి వెళ్లిందన్న మాట. అందుకే సాయితేజ్ ఊపిరి పీల్చుకున్నాడని చెప్పుకుంటున్నారు.

కానీ ఒక విషయం మాత్రం అందరూ ఉపేక్షిస్తున్నారు. ‘ఇంటిలిజెంట్’ నాటికి సాయితేజ్‌కు ఉన్న మార్కెట్ విలువ ఏమిటి? ఇప్పుడున్న మార్కెట్ విలువ ఏమిటి? సగానికి సగం పడిపోయింది. ఎక్కడి రూ. 27 కోట్లు? ఎక్కడి రూ. 12.8 కోట్లు!

అయినా సరే.. ప్రస్తుత మార్కెట్ విలువకు తగ్గట్లు కలెక్షన్లు వచ్చాయా, లేదా అనేదే ముఖ్యం అనుకుంటే సాయితేజ్ రిలీఫ్ ఫీలవుతున్నాడని మనం ఫీలవ్వాల్సింది ఏమీ లేదు.

‘చిత్రలహరి’.. దక్కిందే సంతోషం! | actioncutok.com

Trending now: