అతని డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాల్లేవ్!


అతని డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాల్లేవ్!

అతని డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాల్లేవ్!

టాలీవుడ్‌లోనూ ఇటీవల బాలీవుడ్ తరహా స్పెక్యులేషన్స్ ఎక్కువైపోతున్నాయ్. ఎవరైనా చిన్న కామెంట్ చేస్తే చాలు.. దాన్ని పట్టుకొని కొత్త కొత్త కథలు అల్లేస్తున్నారు సోషల్ మీడియాలో. తాజాగా ‘జెర్సీ’లో నాని నటనను, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌నూ ప్రశంసిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

దీన్ని పట్టుకొని ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత గౌతమ్ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం మొదలు పెట్టేశారు అత్యుత్సాహవంతులు. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షెడ్యూల్ ప్రకారం 2020 జూలైలో విడుదల కావాలి. దానికి రెండు మూడు నెలల ముందుగా షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలనేది రాజమౌళి ప్లాన్.

ఆ ప్రకారం చూస్తే ఎన్టీఆర్ తదుపరి సినిమా 2020 ఏప్రిల్ తర్వాతే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని గౌతమ్ తిన్ననూరికే ఇస్తాడని ప్రచారకర్తల ఊహాగానం. గౌతమ్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు.. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ మాస్ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు కావని స్పష్టమైంది.

గౌతమ్ అభిరుచి చూస్తే కేవలం క్లాస్ ప్రేక్షకులకే అతని సినిమాలు కనెక్టవుతాయని చెప్పేయొచ్చు. మరి మాస్ ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అతని డైరెక్షన్‌లో ఎందుకు చేస్తాడని హీరో సన్నిహిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ మాస్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ను గౌతమ్ అప్రోచ్ అయినా అతని స్క్రీన్‌ప్లే స్లోగా ఉంటుంది కాబట్టి జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితులు లేవనేది వాళ్ల వాదన. ఆ వాదనలో నిజం ఉంది.

అతని డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాల్లేవ్! | actioncutok.com

You may also like: